3 ఇడియ‌ట్స్ ను ఫాలో అవుతున్న సుధీర్ బాబు..

హీరో మీ ప‌క్క‌నే ఉండొచ్చు.. సుధీర్ బాబు మీ ప‌క్క‌నుంచే వెళ్లొచ్చు.. కాస్త క‌ళ్లు జాగ్ర‌త్త‌గా ఉంచుకోండి.. ఎందుకంటే ఇప్పుడు ఈయ‌న మారు వేషాల్లో తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో సినిమా చేయ‌డం కంటే చేసిన సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం. ఇప్పుడు సుదీర్ బాబు కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న న‌టించిన న‌న్ను దోచుకుందువ‌టే విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది.

SUDHEER-BABU-NEW-GETUP

కాక‌పోతే క‌లెక్ష‌న్లు మాత్రం కోరుకున్న‌ట్లు లేవు. దాంతో పెంచే ప‌నిలో ఉన్నాడు సుధీర్ బాబు. అందుకే ప్ర‌మోష‌న్ కోసం మారు వేషాల్లో తిరుగుతున్నాడు. అప్ప‌ట్లో అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ కోసం చేసిన‌ట్లు అన్న‌మాట‌. మొన్న కూడా ఇలాగే ఓ మాల్ కు వెళ్లి స‌ర్ ప్రైజ్ చేసాడు. ఇప్పుడు టూర్ కూడా ఇలాగే వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సుధీర్ బాబు అర‌డ‌జ‌న్ సినిమాలు చేసాడు. హీరోతో పాటు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ క‌నిపించాడు. కానీ ఎప్పుడూ మ‌హేశ్ బావ‌గానే ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కానీ ఈయ‌న సొంత హీరోగా.. న‌టుడిగా మాత్రం గుర్తింపు రాలేదు.

ఇప్ప‌టికీ సొంత గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు అది వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ప్రేమ‌క‌థాచిత్రం.. భ‌లే మంచి రోజు.. శ‌మంత‌క‌మ‌ణి.. మొన్న స‌మ్మోహ‌నం లాంటి సినిమాల‌తో ఈయ‌న ఉన్నాడు అనే గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు న‌న్ను దోచుకుందువ‌టేతో వ‌చ్చాడు. ఈ చిత్రంలో సుధీర్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఎలా ఉన్నా కూడా సుధీర్ కెరీర్ కు మాత్రం మంచి బూస్ట‌ప్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు ఇది కాకుండా మ‌రో రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. మొత్తానికి ఇప్పుడిప్పుడే సుధీర్ బాబు కెరీర్ గాడిన ప‌డుతుంది. ఇప్ప‌ట్నుంచి క‌థ‌లు న‌చ్చితే వ‌ర‌స‌గా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోనూ సినిమాలు చేయాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ హీరో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి వెళ్లి ఆగుతాడో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *