శ్రీ‌కాంత్ అడ్డాల‌.. మ‌రో సీత‌మ్మ వాకిట్లోకు సిద్ధం..

అవును.. ఈయ‌న మ‌రోసారి ఇదే చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న కెరీర్ ను మార్చేసిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మాదిరే మ‌రో సినిమాను కూడా చేయ‌బోతున్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. అయినా కెరీర్ లో ఒక్క సినిమా చాలు క‌దా.. ముంచ‌డానికి. శ్రీ‌కాంత్ అడ్డాల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఒకే ఒక్క సినిమా ఈయ‌న కెరీర్ ను ముంచేయ‌డం కాదు.. క‌నిపించ‌కుండా చేసింది. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మంచి మ‌రీ ఎక్కువైపోయి డిజాస్ట‌ర్ అయిపోయింది. ఆ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసాడు.

Srikanth addala nani movie

ఆ మ‌ధ్య డిజే ఆడియో వేడుక‌లో త‌న సంస్థ‌లో ప‌ని చేసిన ద‌ర్శ‌కులంద‌ర్నీ ఒకే చోట చేర్చాడు దిల్ రాజు. అప్పుడు చూసిందే ఈ ద‌ర్శ‌కున్ని.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట క‌న‌బ‌డ‌లేదు. బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన షాక్ తో ఈయ‌న వైపు చూడ్డానికి కూడా నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకురావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల‌పై న‌మ్మ‌కాల‌న్నీ పోయాయి. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌నోడు ఏ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు. ఆ మ‌ధ్య మెగా కుటుంబంలో ఉన్నాడ‌ని.. అక్క‌డ అల్లు శిరీష్ తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి.

గీతాఆర్ట్స్ లోనే సినిమా ఉంటుంద‌నుకున్నారు కానీ శిరీషే లేద‌ని చెప్ప‌డంతో ఆశ‌లు ఆవిరైపోయాయి. ఇక దిల్ రాజు బ్యాన‌ర్ లోనూ సినిమా కోసం చూస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈయ‌న‌కు కొత్త బంగారు లోకం.. సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమాలు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ న‌మ్మ‌కంతోనే మంచి క‌థ రాసుకొని వెళ్తే రాజుగారు ఛాన్సిస్తార‌ని న‌మ్ముతున్నాడు ఈయ‌న‌. కానీ ఆ మంచి క‌థ కుద‌ర‌డం లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం నాని హీరోగా గీతాఆర్ట్స్ లో సినిమాకు శ్రీ‌కాంత్ సై అనేసాడు. ప్ర‌స్తుతం ఈ క‌థపైనే కూర్చున్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. నాని కూడా జెర్సీతో పాటు మ‌రో రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వాటి త‌ర్వాత శ్రీ‌కాంత్ సినిమా ఉంటుందా.. లేదంటే వెంట‌నే చేస్తాడా అనేది చూడాలి. ఇది సీత‌మ్మ వాకిట్లో ఛాయ‌ల‌తో ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ చిత్రంతో అడ్డాల కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here