య‌శ్ చోప్రాకు ధీటుగా శ్రీ‌దేవి రికార్డ్..

య‌శ్ చోప్రా.. శ్రీదేవి.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇండియ‌న్ సినిమా స్థాయిని పైకి తీసుకొచ్చిన వాళ్లే ఇద్ద‌రూ. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇప్పుడు ఇద్ద‌రూ ఈ లోకంలో లేరు. య‌శ్ చోప్రా ఆరేళ్ల కిందే చ‌నిపోగా.. శ్రీ‌దేవి మాత్రం ఆర్నెళ్ల కింద చ‌నిపోయింది. ఇప్పుడు ఈమెకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది.

ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు రికార్డులు రివార్డులు అందుకున్న శ్రీ‌దేవికి ఇప్పుడు స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం అరుదైన గౌర‌వం అందించ‌బోతుంది. ఈమె విగ్ర‌హాన్ని అక్క‌డ ప్ర‌తిష్టించ‌బోతున్నారు. ఇండియ‌న్ సినిమా హీరోయిన్ కు అక్క‌డ విగ్ర‌హం పెట్ట‌డం ఇదే తొలిసారి. ఈమె న‌టించిన చాందిని సినిమా షూటింగ్ అంతా స్విస్ లోనే జ‌రిగింది. 1989లో రిషికపూర్ కు జోడీగా శ్రీ‌దేవి న‌టించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాతోనే స్విస్ అందాలు ప్ర‌పంచానికి మ‌రింత‌గా తెలిసాయి.

Sridevi

శ్రీ‌దేవి సినిమా వ‌ల్లే త‌మ దేశ‌పు ప‌ర్యాట‌క శాఖ మ‌రింత అభివృద్ధి చెందింద‌ని న‌మ్మి.. ఆ కృత‌జ్ఞ‌త‌తోనే ఇప్పుడు ఈమె రుణం కాస్తైనా తీర్చుకుంటున్నారు అక్క‌డి ప్ర‌భుత్వం. య‌శ్ చోప్రా కూడా ఆయ‌న సినిమాల‌ను ఎక్కువ శాతం స్విట్జ‌ర్లాండ్ లోనే తీసారు. ఇండియ‌న్ సినిమాలు ఈ రోజు స్విస్ కు వెళ్తున్నాయంటే దానికి కార‌ణం య‌శ్ చోప్రా సినిమాలే. ఎప్ప‌ట్నుంచో అక్క‌డ త‌న సినిమాల‌ను షూట్ చేస్తూ వ‌చ్చాడు య‌శ్.

చ‌నిపోయే ముందు వ‌ర‌కు కూడా స్విట్జ‌ర్లాండ్ పై మ‌మ‌కారం చూపించారు ఈయ‌న‌. అందుకే ఈ ద‌ర్శ‌కున్ని కూడా 2011లోనే స‌త్క‌రించుకున్నారు. విగ్ర‌హం కూడా పెట్టి.. అక్క‌డ ఓ ట్రైన్ కు య‌శ్ చోప్రా పేరు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు శ్రీ‌దేవి విగ్ర‌హం కూడా పెట్ట‌బోతుండ‌టంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here