పిచ్చెక్కించిన జూనియ‌ర్ ఐశ్వ‌ర్యారాయ్..

దేవుడు మ‌నుషుల‌ను పోలిన మ‌నుషుల‌ను ఏడుగురును సృష్టిస్తాడంటారు. అలాగే ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ లాంటి అందాన్ని మ‌రో చోట కూడా పుట్టించాడు. కాక‌పోతే ఆ అందం అంత‌గా హైలైట్ కాలేదంతే. ఆ భామ ఎవ‌రో ఇప్ప‌టికే అర్థం అయిపోయి ఉంటుంది క‌దా. ఆ అవును.. మీరు ఊహించిన స్నేహాఉల్లాల్ గురించే మ‌నం చెప్తున్న‌ది.

ఆ భామ‌ను చూస్తుంటే అచ్చంగా ఐశ్వ‌ర్యారాయ్ ను చూస్తున్న‌ట్లుగానే ఉంటుంది. కొన్ని నెల‌లుగా క‌నిపించ‌డం కూడా మానేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో సెగ‌లు రేపుతుంది. ఐష్ అంత అందంగా ఉంటుంది అంటూ ముందు ఈమెను ఆకాశానికి ఎత్తేసారు. కానీ ఇదే ఈమె కెరీర్ కు శాపంగా మారింది. అస‌లు ఐష్ ఉండ‌గా.. న‌కిలితో ప‌నిలేద‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు ఈ భామ‌ను పాపం.

Sneha Ullal Latest Photoshoot Pics
Sneha Ullal Latest Photoshoot Pics

ఇప్ప‌టికీ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు ఈ ముద్గుగుమ్మ‌ను. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లాంటి సినిమాలు హిట్టైనా తెలుగులో స్నేహాకు ఎందుక‌నో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల‌కు క‌నిపించ‌డం కూడా మానేసంది స్నేహా. కేవ‌లం కుటుంబంతో గ‌డ‌పడం.. ఫోటోషూట్ల‌కు ఫోజివ్వ‌డంతోనే కెరీర్ లాగించేస్తుంది స్నేహాఉల్లాల్.

Sneha Ullal Latest Photoshoot Pics
Sneha Ullal Latest Photoshoot Pics

ఇందులో భాగంగానే ఈ మ‌ద్యే ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో అమ్మ‌డు ఇచ్చిన పోజుల‌కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అన‌వ‌స‌రంగా అందాల‌ను వేస్ట్ చేస్తున్నామేమో అనే అనుమానం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా వ‌స్తుంది. అంత‌గా గ్లామ‌ర్ షో చేస్తూ రెచ్చ‌గొడుతుంది స్నేహా. మ‌రి చూడాలిక‌.. ఇప్పటికైనా ఈమె అంటూ ఒక‌రున్నార‌ని మ‌న ద‌ర్శ‌కులు గుర్తిస్తారో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here