రానా ఏం చేస్తున్నాడు.. 2018ని ఎందుకు వ‌దిలేసాడు..?

అవునా.. రానా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయ‌లేదా..? ఎప్పుడు చూసినా ఏదో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండే రానా ఈ ఏడాదిని ఖాళీగా వ‌దిలేసాడా.. విన‌డానికి కూడా విచిత్రంగా ఉంది క‌దా. కానీ ఎంత బిజీగా ఉన్నా 2018లో ఈ హీరో నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇదే ఇప్పుడు అభిమానులకు ఆశ్చర్యం గా మారింది. ఇన్ని సినిమాలు చేస్తున్నా ఒక్కటీ విడుదల చేయకపోవడం ఏంటో అని వాళ్లు షాక్ లో ఉన్నారు.

rana daggubati as chandrababu naidu in ntr biopic

ప్రస్తుతం తెలుగులో రెండు.. హిందీలో 1.. కన్నడలో 1.. తమిళనాట ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు రానా. అందులోనే ఎన్టీఆర్ మహానాయకుడు, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. రానా సపోర్టింగ్ రోల్ చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది త్వరగానే విడుదల కానున్నాయి కానీ హీరోగా నటిస్తున్న సినిమాల వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.

Eros International's 'Aranya' with Rana Daggubati & Prabhu Solomon

 

ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్న సంగతి కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. వీటి షూటింగ్ వివరాలు చెప్పట్లేదు దగ్గుపాటి వారసుడు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ గా చెబుతున్నాడు రానా.. 2019లో తన నుంచి దాదాపు అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి అంటున్నాడు ఈ హీరో. అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో హిర‌ణ్య క‌శ్య‌ప సినిమాలో కూడా నటించబోతున్నాడు రానా. ఈ సినిమా కోసం 180 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతున్నాడు నిర్మాత సురేష్ బాబు. మరి ఈ సినిమాలన్నింటితో రానా కెరీర్ ఎలాంటి మలుపు తిర‌గ‌ర‌బోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here