2.0 బ‌డ్జెట్ మ‌ళ్లీ క‌న్ఫ‌ర్మ్ చేసిన శంక‌ర్..

ఎవ‌డండీ తెలుగు సినిమా త‌క్కువ అన్న‌ది.. ఇండియాలో బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ అన్న‌ది.. ఇప్పుడు చెప్ప‌మ‌నండి ఆ మాట‌. మ‌న సినిమాలు కూడా ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాయి. ఇండియ‌న్ సినిమాపై ఎగురుతున్న జెండా మ‌న సినిమాదే. మ‌న రాజ‌మౌళి చేసిందే.. బాహుబ‌లి. ఆ సినిమా ఏకంగా 2300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి.. తెలుగు సినిమా స‌త్తా బాలీవుడ్ కు చాటి చెప్పింది.

SHANKAR REVEALS 2.0

ఇక ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలో కూడా మ‌న నిర్మాత‌లు చేస్తోన్న సాహసం బాలీవుడ్ లో చేయ‌డం లేదు. ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ 2.0 తెర‌కెక్కుతుంది మ‌న సౌత్ లోనే. ఈ చిత్రం కోసం ఏకంగా 543 కోట్లు పెట్టిస్తున్నాడు శంక‌ర్. ఇక బాహుబ‌లి రెండు భాగాల కోసం దాదాపు 350 కోట్లు పెట్టారు. ఇక ఇప్పుడు శంక‌ర్ ఈ సినిమా కోసం ఏకంగా 540 కోట్లు పెట్టిస్తున్నాడు.
ఈ మాట చెప్పింది ఎవ‌రోకాదు.. స్వ‌యంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు శంక‌రే.

ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం భారీ బ‌డ్జెట్ పెడుతున్నాం.. అది 540 కోట్ల వ‌ర‌కు ఉంటుంది అన్నీ లెక్కేస్తే అని చెప్పాడు శంక‌ర్. అక్ష‌య్ కుమార్ కూడా ఉన్నాడు కాబ‌ట్టి బాలీవుడ్ లో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. అక్క‌డ మ‌రో ద‌ర్శ‌కుడైతే నిర్మాత ఆలోచ‌న‌లో ప‌డేవాడేమో కానీ అడుగుతున్న‌ది శంక‌ర్. 500 కోట్లు పెడితే 1000 వ‌స్తాయ‌ని అత‌డి న‌మ్మ‌కం. అందుకే మ‌రో మాట లేకుండా నిర్మాత కూడా అడిగినంత ఇచ్చేస్తున్నాడు. న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది 2.0. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ 2.0 గురించి ఈ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టాడు శంక‌ర్. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం రేపు విడుద‌లైన త‌ర్వాత ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here