అర్జున్ రెడ్డి పోరి న‌లుపులో అరిపిస్తుందిగా..

ఒక్క హిట్.. ఒక్క హిట్ ప‌డితే చాలు.. ఇండ‌స్ట్రీ అంతా బాబూ అంటారు. ఇక హీరోయిన్ అయితే మేడ‌మ్ అంటూ వెంట ప‌డ‌తారు. మ‌రి ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో హీరోయిన్ గా మారితే.. అచ్చంగా శాలినిపాండేలా ఉంటుంది. ఈ భామ ఇప్పుడు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో దున్నేస్తుంది.
Shalini Pandey Hot Black Dress
అన్నీ టాలెంట్స్ చూపిస్తూ అద‌ర‌గొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్ల‌కు షాలిని గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ చిత్రంలో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ థియేట‌ర్ ఆర్టిస్ట్. ఇప్పుడు వ‌ర‌స‌గా బంప‌ర్ ఆఫ‌ర్లు ఈ భామ చెంత చేరుతున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో ఈ భామే న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.
ఇక 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్ తో పాటు ఆ మ‌ధ్య దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాలో క‌మిటైంది ఈ భామ‌. ఏఎస్ కార్తిక్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా న‌టిస్తుంది ఈ బ్యూటీ. ఇలా వ‌ర‌స సినిమాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ తోనూ అరిపిస్తుంది అర్జున్ రెడ్డి పోరీ. ఇప్పుడు కూడా బ్లాక్ డ్ర‌స్ లో హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది. తాజాగా విడుద‌లైన ఈ ఫోటోలు చూస్తుంటే మ‌తులు పోతున్నాయి. క‌సి చూపుల‌తో క‌ళ్ల‌తోనే ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప అటు అందం.. ఇటు అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here