షారుక్ ఖాన్ స‌ర్ ప్రైజ్.. జీరోలో శ్రీ‌దేవి..

శ్రీ‌దేవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా మాట‌లు చెప్పాలా..? ఆమె చ‌నిపోయిన‌పుడు ఏడ్చిన కొన్ని కోట్ల క‌ళ్లే ఆమెపై ఉన్న అభిమానం ఎంతో చూపిస్తుంది. ఇంకొక్క‌సారి శ్రీ‌దేవిని తెర‌పై చూడాలంటే చూసే భాగ్యం కోల్పోతున్నామే అంటూ వెక్కివెక్కి ఏడ్చారు అభిమానులు. ఇప్పుడు వాళ్లంద‌రి కోసం షారుక్ ఖాన్ ఓ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసాడు. ఈయ‌న న‌టిస్తున్న జీరో సినిమాలో శ్రీ‌దేవి ఉంది.
Shah-rukh-khan-to-keep-late-sridevi-in-zero-movie
అవును న‌మ్మ‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ విష‌యం ఇన్నాళ్లూ బ‌య‌టికి రాకుండా ద‌ర్శ‌క నిర్మాత‌లు జాగ్ర‌త్త ప‌డినా కూడా ఇప్పుడు వ‌చ్చేసింది. జీరోలో ఓ చిన్న పాట‌లో శ్రీ‌దేవి మెరిసింద‌ని తెలుస్తుంది. ఈమె స్క్రీన్ పై క‌నిపించిన చివ‌రి క్ష‌ణాలు ఇవే. దాంతో షారుక్ అభిమానుల‌తో పాటు ఇప్పుడు శ్రీ‌దేవి అభిమానులు కూడా జీరో కోసం చూస్తున్నారు. పైగా ఇప్పుడు షారుక్ వ‌ర‌స ఫ్లాపుల‌తో ఎటూ కాకుండా ఉన్నాడు. అర్జంట్ గా ఓ హిట్ కొడితే కానీ షారుక్ ఉన్నాడ‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు గుర్తు రాదు. ఎందుకంటే మ‌రోవైపు స‌ల్మాన్, అమీర్ దున్నేస్తున్నారు. ఒక‌ప్పుడు వాళ్ల‌కంటే తానే తోపు అని నిరూపించుకున్న షారుక్ ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు.
ఇప్ప‌టికే ఈయ‌న కెరీర్ లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు ట్రై చేసాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు షారుక్. ఎవ‌రెస్ట్ అంత ఇమేజ్ ఉండి కూడా షారుక్ కొత్త క‌థ‌ల వైపు ప‌రుగులు తీస్తున్నాడు. అనుకున్న‌దే త‌డువుగా జీరో సినిమా చేస్తున్నాడు. ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించాడు. అస‌లు కింగ్ ఖాన్ లాంటి హీరో సినిమాకు జీరో అనే టైటిల్ పెట్ట‌డ‌మే కొత్త‌గా ఉంది. ఇక మ‌రుగుజ్జుగా న‌టించ‌డం మ‌రో విశేషం. త‌నూ వెడ్స్ మ‌నూ.. రాంఝ్నా లాంటి సినిమాలు చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దీనికి ద‌ర్శ‌కుడు.
అప్ప‌ట్లో విచిత్ర సోద‌రులు కోసం క‌మ‌ల్ ఈ త‌ర‌హా మ‌రుగుజ్జుగా న‌టించాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు షారుక్ ఖాన్ ఆ పాత్ర చేస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ అండ్ ట్రైల‌ర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఓ వైపు క‌త్రినా.. మ‌రోవైపు అనుష్క శ‌ర్మతో షారుక్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకోవైపు శ్రీ‌దేవి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కూడా ఉంది. 2018, డిసెంబ‌ర్ 21న జీరో చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో కింగ్ ఖాన్ ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here