స‌వ్య‌సాచి టీజ‌ర్.. స‌రిగ్గా తీస్తే ట్రెండ్ సెట్ట‌ర్..

మామూలుగా ఒక త‌ల్లి ర‌క్తం పంచుకుని పుడితే అన్నాద‌మ్ములు అంటారు.. అదే ఒకే ర‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొద‌లుని.. క‌డ‌దాకా ఉండే క‌వచాన్ని.. ఈ స‌వ్య‌సాచిలో స‌గాన్ని.. ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌డానికి..?

ఇది చూసిన త‌ర్వాత చైతూ ఈ సారి గ‌ట్టిగా కొడ‌తాడేమో అనిపిస్తుంది. ఈ డైలాగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి ముస్తాబ‌వుతుంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి.

ఒక్క శ‌రీరంలోనే ఇద్ద‌రు క‌వ‌ల‌లు ఉంటే ఏంటి అనేది ఈ పాత్ర ప్ర‌త్యేక‌థ‌. మిస్ క్యారేజ్ అయిన‌పుడు మాత్ర‌మే ఇలాంటి అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఒకే శ‌రీరంలోకి రెండు ప్రాణాలు వ‌చ్చి చేరుతుంటాయి. రెండో బేబీ ర‌క్తం.. మెదడు.. శ‌రీరం కూడా మొద‌టి బేబీతో పాటే క‌లిసిపోయి ఇద్ద‌రు ఒక్క‌డిగా పుడుతుంటారు. ఈ టీజ‌ర్ చాలా రీ ఫ్రెషింగ్ గా అలాగే సృజ‌నాత్మ‌కంగా ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలో ఎప్పుడూ లేని ఓ కాస్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని దూమొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ అద్బుతంగా ఉంది. విజువ‌ల్స్ ను చాలా బాగా ఊపించారు. స‌వ్య‌సాచి కొన్ని క‌ళ్లు చెదిరిపోయే లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు.. అవ‌న్నీ టీజ‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది.

మాధ‌వ‌న్, భూమికా చావ్లా ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మాధ‌వ‌న్ కూడా ఒక్క సెక‌న్ అలా టీజ‌ర్ లో క‌నిపించారు. ఈయ‌న చాలా డిఫెరెంట్ కారెక్ట‌ర్.. సీరియ‌స్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూకుడు మీదున్న మైత్రి మూవీ మేక‌ర్స్ స‌వ్య‌సాచిని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here