స‌వ్యసాచి ఎలా ఉన్నాడో తెలుసా.. యుఎస్ టాక్..

నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. న‌వంబ‌ర్ 2న సినిమా విడుద‌లైనా కూడా 1 రాత్రే ఓవ‌ర్సీస్ లో భారీగా షోలు ప‌డిపోయాయి. దాంతో టాక్ కూడా ముందే వ‌చ్చేసింది. ఈ చిత్రం అంతా అనుకుంటున్న‌ట్లు పాజిటివ్ టాక్ తో కాకుండా అబౌ యావ‌రేజ్ టాక్ తో ఓపెన్ అయింది. అయితే సినిమాలో కొత్త క‌థ ఉండ‌టం క‌లిసొచ్చేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రాయ‌ని క‌థ‌ను రాసుకున్నాడు చందూ.

Savyasachi Overseas Talk

ఇదే సినిమాకు బ‌లం. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా అక్క‌డ‌క్క‌డా అద్భుత‌మైన సీన్స్ సినిమాను నిల‌బెట్టాయ‌ని.. ముఖ్యంగా తొలి 15 నిమిషాల సినిమా చాలా బాగుంద‌ని.. అక్క‌డే క‌థ అంతా చెప్పాడ‌ని తెలుస్తుంది. ఫ‌స్టాఫ్ లో కాలేజ్ సీన్స్ తో పాటు హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్ కూడా పెద్దగా ఎక్క‌లేద‌ని.. అయితే ఇంట‌ర్వెల్ సీన్ నుంచి మ‌ళ్లీ సినిమా గాడిలో ప‌డిందని చెబుతున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్.

ఇక సెకండాఫ్ బాగుంద‌ని.. మాధ‌వ‌న్ ఎంట్రీ త‌ర్వాత సినిమా రేంజ్ కూడా మారిపోతుందంటున్నారు వాళ్లు. ఫ‌స్టాఫ్ లో రెండు పాట‌లు చాలా బాగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. రీమిక్స్ మాత్రం ఊహించిన‌ట్లుగా లేదని నిరాశ ప‌డుతున్నారు ఫ్యాన్స్. ఇక న‌ట‌న విష‌యానికి వ‌స్తే చైతూతో పాటు సినిమాలో మాధ‌వ‌న్ కూడా చాలా బాగా చేసాడ‌ని తెలుస్తుంది. ఓవ‌రాల్ గా శైల‌జారెడ్డి అల్లుడు కంటే కాస్త బెట‌ర్ టాక్ తోనే స‌వ్య‌సాచి మొద‌లైంది. ఓవ‌ర్సీస్ టాక్ బ‌ట్టి చూస్తుంటే స‌వ్య‌సాచి క‌మ‌ర్షియ‌ల్ గా ప‌ర్లేద‌నిపిస్తుంది కానీ చైతూ కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here