రివ్యూ: స‌వ్యసాచి

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

స‌వ్య‌సాచి.. కొత్త కాన్సెప్ట్.. పాత స్క్రీన్ ప్లే..
Rating: 3/5

www.teluguodu.com

రివ్యూ         : స‌వ్యసాచి
న‌టీన‌టులు   : నాగ‌చైత‌న్య, నిధి అగ‌ర్వాల్, మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం       : ఎంఎం కీర‌వాణి
నిర్మాత‌లు     : న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ చెరుకూరి
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: చ‌ందూ మొండేటి

స‌వ్య‌సాచి.. ఎందుకో తెలియ‌దు కానీ ఈ చిత్రంపై చాలా మందిలో ఆస‌క్తి ఉంది. ముఖ్యంగా అర్జునుడు క‌థ కావ‌డం.. రెండు చేతుల‌కు స‌మాన మైన బ‌లం ఉండ‌టం ఇలాంటి అంశాల‌న్నీ ప్రేక్ష‌కుల్లో కూడా ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఇప్పుడు సినిమాలో కూడా చందూమొండేటి ఇదే మాయ చేసాడా..?

క‌థ‌:
విక్ర‌మ్ ఆదిత్య‌(నాగ‌చైతన్య‌) ఒకే శ‌రీరంలో ఉన్న క‌వ‌ల‌లు. విక్ర‌మ్ ఆధీనంలో లేకుండా త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది ఎడ‌మ‌చేయి. అదే ఆదిత్య‌. దానివ‌ల్ల న‌ష్టాలు లాభాలు రెండూ చూస్తాడు విక్ర‌మ్ ఆదిత్య‌. ఇలాంటి టైమ్ లో అతిపెద్ద యాక్సిడెంట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడు విక్ర‌మ్. అది అనుకోకుండా జ‌రిగింది అనుకుని హాయిగా త‌ను ప్రేమించిన అమ్మాయి చిత్ర‌(నిధి అగ‌ర్వాల్).. స్నేహితులు.. అక్క‌(భూమిక‌), బావ‌(భ‌ర‌త్ రెడ్డి)ల‌తో జీవితం గడుపుతున్న విక్ర‌మ్ కు అది యాక్సిడెంట్ కాదు మ‌ర్డ‌ర్ అని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో అరుణ్(మాధ‌వ‌న్) విక్ర‌మ్ లైఫ్ లోకి వ‌స్తాడు. చంప‌డానికి చూస్తుంటాడు.. కుటుంబాన్ని నాశ‌నం చేస్తాడు.. అస‌లెందుకు విక్ర‌మ్ ను అరుణ్ టార్గెట్ చేసాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
కొన్ని సినిమాలపై ఎందుకో తెలియని ఆసక్తి ఉంటుంది.. అది వాటి కథ వల్ల కావచ్చు లేదంటే వాటి కాన్సెప్ట్ కావచ్చు. సవ్యసాచి కూడా ప్రేక్ష‌కుల్ని ఇలాగే ఆకట్టుకుంది.. ఒకే శరీరంలో ఇద్దరు అంటూ. చందూ మొండేటి రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంది.. ఇప్పటివరకు మనం చూడని కోణం ఇది. దీని చుట్టూనే కథ అల్లుకున్నాడు దర్శకుడు.. అయితే ఊహించనంత పకడ్బందీగా కాదు. మొదట్లోనే కథ చెప్పేసాడు చందూ.. ఆ తర్వాత ఆట మొదలు పెట్టాడు. కన్ఫ్యూజన్ లేకుండా ఒకే బాడీలో ఇద్దరు ఎలా వస్తారో చూపించేసాడు. హీరోకు ఉన్న ఈ యూనిక్ లక్షణాన్ని కామెడీ కోసం వాడుకున్నాడు చందూ. తొలి 15 నిమిషాలు మినహా ఇంటర్వెల్ వరకు కథ ఫ్లాట్ గా వెళ్ళింది.. ఎలాంటి ట్విస్టులు లేకుండా సా…గింది. ఇంటర్వెల్ లో మాధవన్ ఎంట్రీతో కథలో కదలిక వచ్చింది.
సెకండాఫ్ పద్మవ్యూహం కాన్సెప్ట్ తీసుకున్నాడు దర్శకుడు.. అయితే హీరోని అర్జునున్ని చేసాడు. హీరో.. విలన్ మధ్య చాలా సినిమాలు చూసాం కాబట్టి సెకండాఫ్ రొటీన్ అనిపిస్తుంది.. సవ్యసాచి అనే ఒక్క కొత్త కథ చుట్టూ పాత స్క్రీన్ ప్లే అల్లాడు చందూ మొండేటి. కానీ చాలావరకు పర్లేదు అనేలాగే కథని నడిపించాడు. కొత్త కాన్సెప్టుతో వచ్చింది కాబట్టి ఇంకా కొత్తదనాన్ని ఆశిస్తాం కానీ ఇందులో అది కనిపించలేదు. మాధవన్ పాత్ర చాలా బాగా రాసాడు చందూ.. అతడి విలనిజంలో కూడా లాజిక్ ఉంటుంది. త‌న‌ను గుర్తించ‌లేదు కాబ‌ట్టి త‌ను విల‌న్ గా మారాడు.. మేధావి రాక్ష‌సుడిగా మారితే ఎలా ఉంటుంద‌నేది ఈ కారెక్ట‌ర్ లో చూపించే ప్ర‌య‌త్నం చేసాడు చందూమొండేటి. ఓవరాల్ గా ఈ సవ్యసాచి కొత్త కాన్సెప్ట్ వరకు ఓకే.. కానీ తెరపైనే ఎక్కడో కాస్త గాడి తప్పిన ఫీలింగ్..

న‌టీన‌టులు:
సినిమా సినిమాకు త‌న‌లోని న‌టుడికి ప‌రీక్ష పెట్టుకున్నాడు నాగ‌చైత‌న్య‌. శైల‌జారెడ్డి అల్లుడులో ఎంట‌ర్ టైన్మెంట్ బాగా చేస్తాన‌ని చూపించిన చైతూ ఈ సారి మాత్రం ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చూపించాడు. త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసాడు. స‌వ్య‌సాచిగా అద్భుతంగా న‌టించాడు చైతూ. ఇక తెలుగులో వ‌స్తూ వ‌స్తూనే త‌న మార్క్ వేసాడు మాధ‌వ‌న్. ఈయ‌న క‌నిపించిన ప్ర‌తీ సీన్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచింది. అంత‌గా మ‌న ముద్ర చూపించాడు ఈ న‌టుడు. హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ అందాల ఆర‌బోత‌కే ప‌రిమితం అయిపోయింది. అందంగా ఉంది అంతే న‌టిగా కాదు. భూమిక చావ్లా కీల‌క‌మైన పాత్ర‌లో మెప్పించింది. వెన్నెల కిషోర్, స‌త్య‌, వైవా హ‌ర్ష గ్యాంగ్ కామెడీ అక్క‌డ‌క్క‌డా పేలింది.

టెక్నిక‌ల్ టీం:
కీర‌వాణి పాట‌ల కంటే కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాడ‌నిపిస్తుంది. అందుకే పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. నిన్ను రోడ్డు మీద చూసిన‌ట్లు సాంగ్ కూడా అనుక‌న్నంత రెస్పాన్స్ తీసుకురాలేదు. అయితే ఆర్ఆర్ లో మాత్రం తాను కింగ్ అని మ‌రోసారి నిరూపించుకున్నాడు కీర‌వాణి. యువ‌రాజ్ కెమెరా వ‌ర్క్ చాలా బాగుంది. ఆయ‌న సినిమాటోగ్ర‌ఫీతో సినిమా రిచ్ నెస్ పెరిగింది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర్రావ్ ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. చందూమొండేటి ద‌ర్శ‌కుడిగా కంటే ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అయ్యాడు. ఇలాంటి క‌థ‌ను రాసుకోవ‌డం కంటే కూడా తెర‌కెక్కించ‌డంలోనే తెలివితేట‌లు తెలుస్తాయి. చందూమొండేటి అందులో చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాడు కానీ పూర్తిగా కాదు. మైత్రి మూవీ మేక‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ అదిరిపోయాయి.

చివ‌ర‌గా:
స‌వ్య‌సాచి.. కొత్త కాన్సెప్ట్.. పాత స్క్రీన్ ప్లే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here