స‌వ్య‌సాచి ప్రివ్యూ.. చై చేయి ఏం చేస్తుందో..?

పుర‌చేత్తో కొడితే పున‌ర్జ‌న్మ లేకుండా పోతావ్ అంటూ ఓ సినిమాలో బాల‌య్య డైలాగ్ చెప్పి ర‌చ్చ చేస్తాడు. ఇప్పుడు చైతూ ఇదే చేస్తున్నాడు. ఒక చేయి నేప‌థ్యంలో సినిమా చేసాడు చైత‌న్య‌. దాన్ని అందంగా రాసుకున్నాడు చందూమొండేటి. ఈయ‌న ఎడ‌మ‌చేతి నేప‌థ్యంలోనే స‌వ్య‌సాచి రెడీ అయింది.

Savyasachi Movie Preview

 

మ‌రికొద్ది గంట‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. అనుకున్న దానికంటే ఆల‌స్యం అయినా కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. గ‌త చైతూ సినిమాల‌తో పోలిస్తే ఇప్పుడు స‌వ్య‌సాచి మ‌రింత భారీ అంచ‌నాల‌తో వ‌స్తుంది. ట్రైల‌ర్ కూడా యూ ట్యూబ్ లో ర‌చ్చ చేస్తుంది. విడుద‌లైన క్ష‌ణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ర‌ప్ఫాడిస్తుంది ఈ ట్రైల‌ర్. ఇక ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ అంతా కామెడీ ఉంటుంద‌ని.. ఇంట‌ర్వెల్ టైమ్ కు కిడ్నాప్ డ్రామాతో సినిమా మ‌రో రేంజ్ కు వెళ్తుంద‌ని.. ఇక మాధ‌వ‌న్ పాత్ర సినిమాకు ప్రాణం అంటున్నారు.

సెకండాఫ్ అయితే ఊపిరి తీసుకునే వీలు కూడా ఇవ్వ‌కుండా ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ద‌ర్శ‌కుడు చందూమొండేటి సినిమాను ప‌రుగులు పెట్టించాడ‌ని తెలుస్తుంది. మ‌రీ ముఖ్యంగా చైతూ కూడా ఈ చిత్రంలో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అద‌ర‌గొట్టాడ‌ని.. నిధి అగ‌ర్వాల్ అందాలు సినిమాకు బోన‌స్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి.

ఇక ఇప్పుడు విడుద‌లైన సుభ‌ద్ర ప‌రిణ‌యం సీన్ చూసిన త‌ర్వాత సినిమాలో కామెడీకి కూడా ఢోకా లేద‌ని అర్థ‌మైపోతుంది. మాధ‌వ‌న్ తొలిసారి తెలుగులో న‌టిస్తున్నాడు.. పైగా విల‌న్ పాత్ర‌తో ప‌రిచ‌యం అవుతున్నాడు. ట్రైల‌ర్ లో ఆయ‌న ఎంట్రీకి రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా క‌చ్చితంగా ఈయ‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు. తెలుగులో కూడా మాధ‌వ‌న్ కు ఈ చిత్రం త‌ర్వాత అభిమానులు రావ‌డం ఖాయం. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూకుడు మీదున్న మైత్రి మూవీ మేక‌ర్స్ స‌వ్య‌సాచిని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 1 రాత్రి నుంచే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. మొత్తానికి చైతూ గట్టిగా చెయ్యెత్తి కొడితే బాక్సాఫీస్ బ‌ద్ధ‌లైపోయేలా క‌నిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here