దీపావళికి ఎప్పుడు తెలుగు సినిమాలు రావు.. అప్పుడు వచ్చేది కేవలం తమిళ్ డబ్బింగ్ సినిమాలే. ప్రతీసారి మాదిరే ఈ సారి కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా డబ్బింగ్ సినిమాల దండయాత్రే సాగుతుంది. ఈ దివాళికి మన సినిమాలేం రావడం లేదు. వచ్చేది తమిళ సినిమా సర్కార్. అక్కడితో పాటు ఇక్కడ కూడా ఒకేసారి విడుదల అవుతుంది ఈ చిత్రం. గతంలో విజయ్ సినిమాలతో పోలిస్తే సర్కార్ మరింత భారీగా వస్తుంది. ఇక్కడే 750 స్క్రీన్స్ లో విడుదల అవుతుంది సర్కార్. పైగా ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.
ఈ సారి కచ్చితంగా విజయ్ మరింత భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఈయన దూకుడు చూస్తుంటే అమ్మిన రేట్స్ 7 కోట్లు మూడు రోజుల్లోనే వచ్చేలా కనిపిస్తున్నాయి. అదిరిందితో తొలి విజయం అందుకున్న విజయ్.. వరసగా రెండో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇదే కానీ జరిగితే తెలుగులో విజయ్ మార్కెట్ పెరిగిపోయినట్లే. ఇక్కడ ఇంకోటి గమనించాలి.. విజయ్ కు మార్కెట్ లేని టైమ్ లో సూర్య, విక్రమ్ లాంటి వాళ్లు రప్ఫాడించారు. ఇప్పుడు విజయ్ స్టార్ అవుతున్న టైమ్ లో వాళ్లు డల్ అవుతున్నారు. మరి చూడాలిక.. తెలుగు దివాళిని సర్కార్ ఎలా సెలెబ్రేట్ చేయనున్నాడో..
