స‌ర్కార్ కు తెలుగులో 750 థియేట‌ర్స్..

ఒక‌ప్పుడు విజ‌య్ సినిమా వ‌స్తుందంటే థియేట‌ర్స్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఈయ‌న సినిమా ఇక్క‌డ ప్రేక్ష‌కులు చూడ‌రుగా అంటూ లైట్ తీసుకునేవాళ్లు. దానికి త‌గ్గ‌ట్లే శంక‌ర్, మురుగ‌దాస్ లాంటి ద‌ర్శ‌కులు చేసిన సినిమాలు కూడా విజ‌య్ కి హిట్ ఇవ్వ‌లేక‌పోయాయి ఇక్క‌డ‌. అయినా కూడా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా దండ‌యాత్ర చేసి చివ‌రికి అదిరిందితో హిట్ కొట్టాడు విజ‌య్.

sarkar telugu version release in 750 theaters

అట్లీ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం త‌మిళ్ తో పాటు తెలుగులోనూ సంచ‌ల‌నం సృష్టించింది. దాంతో ఇప్పుడు స‌ర్కార్ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఓటు హ‌క్కు నేప‌థ్యంలో తెర‌కెక్కింది.
ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న స‌ర్కార్ న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. తెలుగులో కూడా భారీగానే విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం.

ఇక్క‌డ ఏకంగా 750 స్క్రీన్స్ ఈ చిత్రానికి ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నం. ఒక‌ప్పుడు విజ‌య్ సినిమా విడుద‌ల చేయ‌డం కూడా వేస్ట్ అనుకున్న బ‌య్య‌ర్లు ఇప్పుడు ఎగ‌బ‌డి తీసుకున్నారు. ఈ చిత్రం తెలుగు హ‌క్కులు కూడా 7 కోట్ల‌కు వెళ్లాయి. అంటే 7.5 కోట్లు వ‌స్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. స‌ర్కార్ పై ఉన్న అంచ‌నాలు.. దీపావళికి మ‌రో సినిమా లేదు కాబ‌ట్టి క‌చ్చితంగా హిట్ కొట్టేలాగే క‌నిపిస్తుంది. ఇదే కానీ విజ‌య్ కూడా తెలుగులో స్టార్ అయిపోతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *