స‌ర్కార్ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

విజ‌య్-మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో క‌త్తి, తుపాకి లాంటి సినిమాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా అంటే అంచ‌నాలు భారీగానే ఉంటాయి. మ‌రి దానికి త‌గ్గ‌ట్లే స‌ర్కార్ ముస్తాబ‌యిందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది..? ప‌్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందా లేదా..?

క‌థ‌:
సుంద‌ర్ రామ‌స్వామి(విజ‌య్) కార్పోరేట్ కింగ్. అమెరికాలోనే స్థిర‌ప‌డిపోయి ఉంటాడు. అలాంటిది త‌న ఓటు హ‌క్కు కోసం ఇండియాకు వస్తాడు. కానీ వ‌చ్చిన త‌ర్వాత తన ఓటు ఎవ‌రో దొంగ‌త‌నంగా వేసార‌ని తెలుసుకుని కోర్టుకు వెళ్ళి న్యాయంగా తెచ్చుకుంటాడు. ఆ త‌ర్వాత అదే కార‌ణంతో కొన్ని ల‌క్ష‌ల మంది కోర్టుకు వెళ్తారు. అంతా త‌మ ఓటు వెన‌క్కి కావాల‌ని అడుగుతారు. ఆ దెబ్బ‌కు గెలిచిన ప్ర‌భుత్వం కాస్తా కూలిపోతుంది. ఆ త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కులు సుంద‌ర్ పై కోపం పెంచుకుంటారు కానీ ఈయ‌న మాత్రం తానే చేయాల‌నుకున్న‌ది చేస్తూనే ఉంటాడు. చివ‌రికి రాజ‌కీయాల్లోకి కూడా వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? ఈ ప్ర‌యాణంలో లీల‌(కీర్తిసురేష్) ఎలా క‌లిసింది అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
గెలిచిన రాజ‌కీయ నాయ‌కుల ప‌దవీకాలం ఐదేళ్లు.. వాళ్ల‌ను గెలిపించిన ప్ర‌జ‌ల ప‌ద‌వీకాలం మాత్రం ఒక్కరోజు.. కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క‌రోజు.. అదే ఓటింగ్ డే. ఆ ఓటును కూడా నోటుకు అమ్ముకుంటే నోట మాట రాకుండా ప్ర‌జ‌ల‌ను తొక్కేస్తారు రాజ‌కీయ నాయ‌కులు. ఇదే క‌థ‌ను తీసుకున్నాడు మురుగ‌దాస్.. ఓటు విలువ చెప్పే ప్ర‌య‌త్నం స‌ర్కార్ సినిమాతో చేసాడు. త‌న ప్ర‌తీ క‌థ‌లోనూ సోష‌ల్ మెసేజ్ ఉండేలా చూసుకునే మురుగ‌దాస్.. ఈ సారి ఆ డోస్ ఇంకాస్త పెంచేసాడు. ఎలాంటి భ‌యం బెరుకు లేకుండా రాజ‌కీయాల‌పై.. ప్ర‌స్తుత రాజ‌కీయ పార్టీల‌పై చాలా సెటైర్లు వేసాడు. స‌మాజంలో లోపాల‌ను ఆస‌క్తికరంగా చూపిస్తూ.. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దే మురుగ‌దాస్ ఈ సారి త‌డ‌బ‌డిన‌ట్లు అనిపించింది. స‌ర్కార్ లో స్ట్రాంగ్ క‌థ అయితే ఉంది కానీ దాన్ని ముందుకు న‌డిపించే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం లోపించింది. సినిమా మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కు ఓ స‌ర్కిల్ గీసి అందులోనే క‌థ న‌డిచిందేమో అనిపిస్తుంది.
ఒకేచోట గింగిరాలు తిరిగే క‌థ‌లో పాపం విజ‌య్ ఎంత ట్రై చేసినా కూడా ఒడ్డుకు చేర‌లేక‌పోయింది స‌ర్కార్. క‌త్తి, తుపాకి లాంటి సినిమాల‌ను స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసిన మురుగ‌దాస్.. స‌ర్కార్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండుంటే బాగుండేది. కొన్ని సీన్లు బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు.. ముఖ్యంగా విజ‌య్ ఇండియా వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగే 15 నిమిషాల క‌థ బాగుంది. ఆ త‌ర్వాత ఏం చేస్తాడా అనే ఆస‌క్తి పుట్టించాడు మురుగ‌దాస్.. కానీ త‌ర్వాత క‌థ‌నం నెమ్మ‌దించింది.. దాంతో స‌ర్కార్ కూడా రొటీన్ పొలిటిక‌ల్ డ్రామాగా మారిపోయింది.. అక్క‌డ‌క్క‌డా ప్ర‌భుత్వాల‌పై సెటైర్లు బాగానే ప‌డ్డాయి. ఫ‌స్టాఫ్ ప‌ర్లేదు.. సెకండాఫ్ క‌థ బ‌రువైపోయి క‌థ‌నం బ‌ల‌హీన‌ప‌డింది. అది కానీ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ అయ్యుంటే మ‌రో క‌త్తి అయ్యుండేదేమో..? విజ‌య్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసాడు.. సుంద‌ర్ రామ‌స్వామిగా స్క్రీన్ పై మ్యాజిక్ చేసాడు. అత‌డి రాజ‌కీయ అరంగేట్రం తీసుకున్న సినిమాలా అనిపిస్తుంది స‌ర్కార్ కానీ క‌త్తి, తుపాకి రేంజ్ లో ఆక‌ట్టుకోలేదు. అయినా కూడా మంచి క‌థ కోసం ఓ సారి ఈజీగా చూడొచ్చు.

న‌టీన‌టులు:
విజ‌య్ న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఆక‌ట్టుకున్నాడు.. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో మ్యాజిక్ చేసాడు. కార్పోరేట్ క్రిమిన‌ల్ గానే కాదు.. పొలిటిక‌ల్ కింగ్ గా కూడా అల‌రించాడు. అప్పుడ‌ప్పుడూ రాజ‌కీయ పార్టీల‌పై సెటైర్లు వేసాడు. ఇక కీర్తిసురేష్ మాత్రం మ‌రోసారి రొటీన్ పాత్ర‌లో న‌టించింది. మ‌హాన‌టి లాంటి సినిమా త‌ర్వాత ఆమెను ఇలాంటి పాత్ర‌ల్లో చూడటం ఫ్యాన్స్ కు ఇబ్బందే. వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ గా బాగా చేసింది కానీ చాలా త‌క్కువ సీన్స్ లో క‌నిపిస్తుంది. సీనియ‌ర్ యాక్ట‌ర్ రాధార‌వి ఆక‌ట్టుకున్నాడు. ఈయ‌న పాత్రను మురుగ‌దాస్ బాగానే డీల్ చేసాడు. క‌మెడియ‌న్ యోగిబాబు ఉన్న కామెడీ లేదు. మిగిలిన వాళ్లంతా జ‌స్ట్ ఓకే.

టెక్నిక‌ల్ టీం:
ఏఆర్ రెహ‌మాన్ సంగీతానికి ఏం వంక పెడ‌తాం. కాక‌పోతే ఆయ‌న పాట‌లు ఇక్క‌డ ఆక‌ట్టుకోలేదు కానీ ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. రామ్ ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ సీన్స్ కు ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. గిరీష్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ బాగుంది. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ క‌త్తిరించి ఉంటే బాగుండేదేమో..? ఎందుకంటే అప్ప‌టికే 2 గంట‌ల 44 నిమిషాల సినిమా అయిపోయింది. క‌త్తి, తుపాకితో పోలిస్తే మురుగ‌దాస్ సర్కార్ తో ఆక‌ట్టుకోలేదు. అలాగ‌ని తీసిపారేసే సినిమా అయితే కాదు. క‌చ్చితంగా ఆలోచింప‌చేసే సినిమానే.. కానీ స్క్రీన్ ప్లే బాగుంటే అదిరిపోయేది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణం అద్భుతం.

చివ‌ర‌గా:
ఈ స‌ర్కార్.. స్ట్రాంగ్ కంటెంట్.. వీక్ స్క్రీన్ ప్లే..

 

రివ్యూ: స‌ర్కార్
న‌టీన‌టులు: విజ‌య్, కీర్తిసురేష్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, రాధార‌వి త‌దిత‌రులు
క‌థ‌: వ‌రుణ్ రాజేంద్ర‌న్, మురుగ‌దాస్
క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: ఏఆర్ మురుగ‌దాస్
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here