తెలుగులో స‌ర్కార్ సంచ‌ల‌న వ‌సూళ్లు..

విడుద‌ల‌కు ముందు ఎవ‌రూ ఊహించ‌లేదు స‌ర్కార్ ఈ స్థాయిలో వ‌సూలు చేస్తుంద‌ని.. తొలిరోజు టాక్ చూసిన త‌ర్వాత క‌నీసం 4 కోట్లైనా వ‌స్తాయా అని హేలన చేసిన వాళ్లు కూడా లేక‌పోలేరు. తెలుగులో విజ‌య్ జాత‌కం మార్చ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదంటూ చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేసి న‌వ్వుకున్నారు కూడా.

Sarkar

అయితే ఇప్పుడు స‌ర్కార్ సినిమా అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇప్ప‌టికే రెండ్రోజుల్లో 4.4 కోట్ల షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించిన స‌ర్కార్.. మూడోరోజు కూడా చాలా చోట్ల అత్య‌ధిక వ‌సూళ్లు న‌మోదు చేసింది. మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 6 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని తెలుస్తుంది. ఇప్పుడే వీకెండ్ మొద‌లు కావ‌డం.. బ‌రిలో పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డం.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ కూడా డిజాస్ట‌ర్ కావ‌డం స‌ర్కార్ కు క‌లిసొస్తుంది.

ఈ చిత్రం తెలుగులో సేఫ్ కావాలంటే 7.5 కోట్లు రావాలి. ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అంటే అదిరింది త‌ర్వాత తెలుగులో విజ‌య్ మ‌రో హిట్ కొట్టాడ‌న్న‌మాట‌. పైగా ఇప్పుడు స‌ర్కార్ పై ఉన్న వివాదాల దృష్ట్యా సినిమాపై మ‌రింత ఆస‌క్తి చూపిస్తున్నారు ప్రేక్ష‌కులు. దాంతో క‌చ్చితంగా స‌ర్కార్ పెద్ద విజ‌యం దిశ‌గా అడుగులేస్తుంది. మొత్తానికి ఒక‌ప్పుడు విజ‌య్ సినిమా అంటే చుల‌క‌న‌గా చూసేవాళ్లు ఇప్పుడు ఆయ‌న సినిమా వ‌స్తుంద‌టే ఆలోచ‌న‌ల‌తో చూస్తున్నారు. ఇదే క‌దా మార్పు అంటే.. అంతే మ‌రి.. కాస్త లేట్ గా అయినా విజ‌య్ కు తెలుగులో మార్కెట్ మొద‌లైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here