స‌ర్కార్ ఫ‌స్ట్ టాక్.. బొమ్మ హిట్టేనా..?

విజ‌య్-మురుగ‌దాస్ ఈ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌కే కాదు.. బాక్సాఫీస్ కు కూడా పండ‌గే. క‌త్తి, తుపాకి సినిమాల‌తో బ్లాక్ బస్ట‌ర్లు ఇచ్చిన కాంబినేష‌న్ ఇది. ఇప్పుడు మూడోసారి స‌ర్కార్ అంటూ వ‌చ్చేసారు. మిల‌ట‌రీ.. రైతులు గురించి తొలి రెండు సినిమాల్లో చెప్పిన మురుగ‌దాస్ ఈ సారి ఓట్ల గురించి చెప్పాడు. ఒక్క ఓటే క‌దా అని వ‌దిలేస్తే అది ఎలా మ‌న జీవితాల‌ను మార్చేస్తుంద‌నేది స‌ర్కార్ లో చూపించాడు మురుగ‌దాస్. ఇక విజ‌య్ కూడా ఈ క‌థ‌లో ఒదిగిపోయాడు. ఇప్పుడు విడుద‌లైన సినిమాకు టాక్ బాగానే వ‌చ్చింది.

Sakar Movie Madras high court issues

మెర్స‌ల్ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రాలేదు కానీ క‌చ్చితంగా బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డం ఖాయం. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ కాస్త యావ‌రేజ్ గా ఉన్నా కూడా కీల‌క‌మైన సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందంటున్నారు. ప్ర‌భుత్వంపై రాజ‌కీయ నాయ‌కుల‌పై విజ‌య్ వేసిన పంచులు బాగానే పేలాయి.. టీజ‌ర్ లోనే క‌నిపించాయి కూడా.

ఇప్పుడు సినిమాలో అంత‌కంటే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాత క‌థ‌నే ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించాడు మురుగ‌దాస్. ఆయ‌న‌కు కూడా స్పైడ‌ర్ షాక్ లోంచి బ‌య‌టికి వ‌చ్చేందుకు స‌ర్కార్ యూజ్ అవుతుంది. మొత్తానికి సినిమా బాగానే టాక్ తెచ్చుకుంది.. మ‌రి అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా ప్ర‌భావం చూపిస్తుంద‌నేది కావాలి. అన్న‌ట్లు స‌ర్కార్ సేఫ్ అవ్వాలంటే 150 కోట్లు షేర్ రావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here