స‌ర్కార్ కాంట్ర‌వ‌ర్సీ.. మురుగ‌దాస్ ఇంట్లో పోలీసులు..

త‌మిళ‌నాట న‌వంబ‌ర్ 8 అర్ధ‌రాత్రి హై డ్రామా న‌డిచింది. అక్క‌డే మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయ‌న లేని టైమ్ లో ఇంటికి వెళ్లి త‌లుపు బాదారు. ఉంటే అరెస్ట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. దానికి కార‌ణం స‌ర్కార్ సినిమా.. అందులో డైలాగులు. రెండు రోజులుగా ఈ సినిమాపై రచ్చ న‌డుస్తూనే ఉంది. సెన్సార్ పూర్తైన సినిమాను కూడా త‌మిళ‌నాట రాజ‌కీయ నాయ‌కులు వ‌ద‌ల‌ట్లేదు. ప్రేక్ష‌కులు చూసి బాగుంది అంటుంటే కూడా వాళ్లు మాత్రం త‌మ రాజ‌కీయాలు చేస్తూనే ఉన్నారు.

Sarkar murugadoss

సినిమాలో జ‌య‌ల‌లిత‌తో పాటు క‌రుణానిధికి సంబంధించిన వివాదాస్ప‌ద డైలాగులు కూడా ఉన్నాయంటూ వాటిని వెంట‌నే తీసేయాలంటూ ర‌చ్చ జ‌రుగుతుంది. తీయ‌క‌పోతే సినిమాను ఆపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు కూడా.గ‌తేడాది మెర్స‌ల్ విష‌యంలోనూ ఇదే ర‌చ్చ జ‌రిగింది. ఇప్పుడు స‌ర్కార్ కు కూడా త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేసింది . అక్క‌డి లా మినిష్ట‌ర్ ష‌న్ముగం.. మ‌రో మంత్రి సిఏ రాజు లాంటి వాళ్లు ఇప్ప‌టికే స‌ర్కార్ ప్ర‌ద‌ర్శ‌న ఆపేయాలంటూ గొడ‌వ‌లు చేస్తున్నారు.

కానీ ఇంత జ‌రుగుతున్నా చిత్ర‌యూనిట్ కూడా చిత్రం చూస్తుంది కానీ నోరు మెద‌ప‌డం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా మురుగ‌దాస్ ను అరెస్ట్ చేయ‌డానికి ఆయ‌న ఇంటికి పోలీసులు రావ‌డంతో ఇష్యూ మ‌రింత సీరియ‌స్ అయింది. దీనిపై ఆయ‌న కూడా ట్వీట్ చేసాడు. త‌మ ఇంటికి పోలీస్ వ‌చ్చింది నిజ‌మే అని.. కానీ తాను లేక‌పోయేస‌రికి వెళ్లిపోయార‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఈ ఇష్యూపై న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్ ట్వీట్ చేసాడు ఈ విష‌యంపై. డైరెక్టర్ మురుగదాస్ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ఒకసారి సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతించి.. ప్రేక్షకులు కూడా సినిమాను చూసిన తర్వాత ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ రాసుకొచ్చాడు. ఇక ర‌జినీకాంత్ కూడా ఇదే చెప్పాడు. ఒక్క‌సారి సినిమా సెన్సార్ అయిపోయిన త‌ర్వాత అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేదు. మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వెళ్ల‌డాన్ని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి చెన్నైలో ఇప్పుడు చాలా చాలా సీన్స్ జ‌రుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here