స‌మంత ప‌క్కా ప్లానింగ్ తో కొడుతుందిగా..

పెళ్లి త‌ర్వాత ఎవ‌రండీ హీరోయిన్ల కెరీర్ స్లో అవుతుంద‌ని చెప్పింది..? స‌మంత కాద‌ని నిరూపించింది. కానీ త‌న‌కు తానే స్ల్ అయ్యేలా చేసుకుంటుంది కూడా. ఎందుకంటే భ‌ర్త చైతూ కోసం. నాగ‌చైత‌న్య‌తో టైమ్ స్పెండ్ చేయ‌డానికి సినిమాలు వ‌చ్చినా కూడా వ‌దిలేసుకుంటుంది స‌మంత‌.

samantha

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు పూర్తి చేసి.. ఇక‌పై ఒప్పుకునే సినిమాల విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది స్యామ్. ఇప్ప‌టికీ స్టార్ హీరోల నుంచి వ‌ర‌స అవ‌కాశాలు వ‌స్తున్నా కూడా త‌నే కావాల‌ని ఒప్పుకోవ‌డం లేదు ఈ భామ‌. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య సినిమా మాత్ర‌మే చేస్తుంది స‌మంత‌. శివ‌నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.
ఇక దాంతోపాటు నందిని రెడ్డి తెర‌కెక్కించ‌బోయే మిస్ గ్రానీ రీమేక్ లో కూడా న‌టించ‌డానికి సై అనేసింది స‌మంత‌.

ఈ రెండు సినిమాల త‌ర్వాత క‌థ మ‌ళ్లీ బాగా న‌చ్చితే కానీ మ‌రో సినిమా ఒప్పుకోకూడ‌ద‌ని ఫిక్సైంది స‌మంత‌. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో గ‌డిపే స‌మయాన్ని మాత్రం మిస్ చేసుకోవాల‌నుకోవ‌డం లేదు ఈ మాయ‌లేడి. అందుకే ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళ్తుంది. అలాగే సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటుంది. మ‌రి స్యామ్ ప్లాన్ కు త‌గ్గ‌ట్లుగానే మ‌న ద‌ర్శ‌కులు కూడా మారిపోతారేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here