అప్ప‌ట్లో సావిత్రి.. ఇప్పుడు స‌మంత..

అప్ప‌ట్లో బుట్టో.. ఇప్పుడు ముషార‌ఫ్ అన్న‌ట్లు ఏంటిది అనుకుంటున్నారా..? ఇప్పుడు స‌మంత చేస్తున్న ప‌ని అలాగే ఉంది మ‌రి. ఎందుకంటే ఒక‌ప్పుడు సావిత్రి సృష్టించిన రికార్డ్ ఇప్పుడు స‌మంత చేస్తుంది. 50 ఏళ్లుగా చెక్కు చెద‌ర‌కుండా ఉన్న ఆ రికార్డ్ ఇప్పుడు స‌మంత చేతిలో ప‌డింది.

Samantha is today Savitri

అన్న‌ట్లుగానే ఇప్పుడు సావిత్రి రికార్డుపై క‌న్నేసింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం భ‌ర్త నాగ‌చైత‌న్య హీరోగా మ‌జిలి సినిమా చేస్తున్న ఈ భామ‌.. త‌ర్వాత నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతుంది. కొరియ‌న్ మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో స‌మంత బామ్మ‌గా న‌టిస్తుంది. 74 ఏళ్లు ఉన్న బామ్మ కాస్త పాతికేళ్ల భామ‌గా మారిపోతే ఎలా ఉంటుంది అనేది క‌థ‌.
ఆ త‌ర్వాత మారిపోయిన ప‌రిస్థితుల క‌థే మిస్ గ్రానీ సినిమా.

ఈ సినిమాను నందిని రెడ్డి తెర‌కెక్కిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అంతా లేడీ టెక్నీషియ‌న్సే ప‌ని చేయ‌బోతున్నారు. 50 ఏళ్ల కింద సావిత్రి ఈ రికార్డ్ కు తెరతీసింది. 1969లో వ‌చ్చిన చిన్నారి పాప‌లు సినిమాకు అంతా లేడీ టెక్నీషియ‌న్స్ ప‌ని చేసారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు స‌మంత ఇదే చేస్తుంది. ఏ టూ జ‌డ్ అంతా లేడీ టెక్నీషియ‌న్స్ మాత్ర‌మే ప‌ని చేస్తూ సావిత్రి స‌ర‌స‌న చేరాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి అప్పుడు చిన్నారిపాప‌లు మంచి విజ‌యం సాధించింది.. ఇప్పుడు స‌మంత ఏం చేస్తుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here