చైతూ-స‌మంత మ‌జిలి ఎంత దూరం వ‌చ్చింది..?

అక్కినేని భార్యాభ‌ర్త‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం మ‌జిలి. అప్ప‌ట్లో నాగార్జున‌, అమ‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇదే కుటుంబం నుంచి మ‌రో జంట చైతూ, స్యామ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఈ జోడీ క‌లిసి న‌టిస్తున్న సినిమాకు మ‌జిలి అనే వ‌ర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు.

Naga Chaitanya Samantha

నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివ‌నిర్వాన ఇప్పుడు అక్కినేని జంట కోసం అద్భుతమైన క‌థ వండుకుని తీసుకొచ్చాడు. చైతూ, సామ్ క‌లిసి న‌టిస్తున్నారంటే ఉండే అంచ‌నాలు వేరుగా ఉంటాయి కాబ‌ట్టే ఇన్ని రోజులు ఎన్ని క‌థ‌లు వ‌చ్చినా వ‌ద్ద‌న్నారు ఈ జంట‌. కానీ ఇప్పుడు కాద‌నలేని క‌థ‌తో వ‌చ్చాడు శివ‌. దాంతో కాద‌న‌లేక క‌మిటైపోయారు ఈ జోడీ.
ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ 40 శాతం పూర్త‌యింది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు వైజాగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చైతూ, స్యామ్ ఇప్పుడు అది కూడా పూర్తి చేసారు. న‌వంబ‌ర్ 23న చైతూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా షూటింగ్ అప్ డేట్స్ చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మించిన హ‌రీష్ పెద్ది, సాహు గ‌రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిన్నుకోరి త‌ర‌హాలోనే ఇది కూడా మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో నిజంగానే భార్యాభ‌ర్త‌ల్లా న‌టిస్తున్నారు చైస్యామ్. ఇప్పుడు ఇల్లాలే సినిమాలో కూడా ఇల్లాలు కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రి ఈ రియ‌ల్ లైఫ్ క‌పుల్ తో క‌లిసి శివ‌నిర్వాన ఏం మాయ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here