స‌ర్కార్ అనుకున్న టైమ్ కు విడుద‌ల‌వుతుందా..?

ఓ వైపు సెన్సార్ కూడా అయిపోయింది.. మ‌రో ప‌ది రోజుల్లో విడుద‌ల అని అన్నిచోట్లా ప్ర‌మోష‌న్ కూడా మొద‌లుపెట్టారు ఇప్పుడు విడుద‌ల‌వుతుందా అనే ప్ర‌శ్న ఏంటి అనుకుంటున్నారా..? ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయింది.. సీన్ లోకి మ‌ద్రాస్ హై కోర్ట్ వ‌చ్చింది కాబ‌ట్టి. స‌ర్కార్ క‌థ నాదేనంటూ వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే రైట‌ర్ కోర్ట్ మెట్లెక్కాడు. ఈ ర‌చ‌యిత‌కు స‌పోర్ట్ గా సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ రైట‌ర్స్ అసోషియేష‌న్ కూడా ముందుకు క‌దిలింది.

Sakar Movie Madras high court issues

వాళ్లంతా క‌లిసి కోర్టుకు క‌దిలారు. అక్క‌డ జ‌డ్జ్ కూడా వీళ్ల బాధ విని అక్టోబ‌ర్ 30లోపు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మురుగ‌దాస్ ను ఆదేశించింది. క‌త్తికి కూడా ఇలాంటి కాపీ ఇష్యూస్ వ‌చ్చాయి. స్పైడ‌ర్ క‌థ నాదేనంటూ అప్పుడు ఓ రైట‌ర్ వ‌చ్చాడు. మురుగ‌దాస్ ఏ సినిమా చేసినా కూడా ఇలా విడుద‌ల‌కు ముందు ర‌చ్చ జ‌ర‌గ‌డం కామ‌న్ అయిపోయింది.

ఇక విజ‌య్ సినిమాల‌కు అయితే ఇది ఆన‌వాయితీ. ప్ర‌తీ సినిమా విడుద‌ల‌కు ముందు ఇలా జ‌ర‌గ‌డం.. విడుద‌ల త‌ర్వాత అది సంచ‌ల‌నం సృష్టించ‌డం కామ‌న్. మెర్స‌ల్ కు కూడా ఇది త‌ప్ప‌లేదు. తుపాకి.. క‌త్తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత విజ‌య్ తో మురుగ‌దాస్ చేస్తోన్న సినిమా ఇది. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు మురుగ‌దాస్ కెరీర్ కూడా స‌ర్కార్ పైనే ఆధార‌ప‌డి ఉంది.పైగా క‌త్తి.. తుపాకికి ముందు కూడా మురుగ‌దాస్ కు ఫ్లాపులు ఉన్నాయి.

విజ‌య్ సినిమాతోనే మ‌ళ్లీ హిట్ కొట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. స్పైడ‌ర్ తో పాటు దానికి ముందు అకీరా కూడా ఫ్లాపే. దాంతో ఈ రెండు ఫ్లాపుల్ని మ‌రిపించ‌డానికి ఇప్పుడు మురుగ‌దాస్ స‌ర్కార్ తో వ‌స్తున్నాడు. ఇది పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ తో వ‌స్తుంది. ఓటుహ‌క్కు విలువ చెప్పేలా ఈ క‌థ చెబుతున్నాడు మురుగ‌దాస్. మొత్తానికి అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే న‌వంబ‌ర్ 6న విడుద‌ల విడుద‌ల కానుంది స‌ర్కార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here