ప్రేమ‌లో ఉన్నాను.. స‌హ‌జీవనం త‌ప్పేంటి.. సాయిప‌ల్ల‌వి సంచ‌ల‌నం..

ఇండస్ట్రీలో అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడే హీరోయిన్లు చాలా తక్కువ. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడుతుంటారు ముద్దుగుమ్మలు. లేనిపోనిది మాట్లాడితే అది వాళ్ళ కెరీర్ పై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని.. ఎలాంటి వివాదాలు కానీ కాంట్రవర్సీ కామెంట్ జోలికి కానీ వెళ్ళరు. కానీ సాయి పల్లవి మాత్రం తనకు ఎలాంటి భయం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేసింది ఈ భామ‌. సమాజం వివాదంగా భావించే సహజీవనం గురించి నోరు విప్పింది సాయి పల్లవి. ఈ మధ్యన నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెరకెక్కించాడు. పడి పడి లేచే మనసు ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమా తనకు మనసుకు నచ్చింది అని చెబుతోంది సాయి పల్లవి. ఇదే మాట శ‌ర్వానంద్ కూడా చెప్పాడు.

Sai Pallavi Shocking Statements on Her Love Relationship
Sai Pallavi Shocking Statements on Her Love Relationship

ఇక ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి ని ఓ విలేకరి సహజీవనం గురించి అడిగాడు. మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా.. లేదంటే డేటింగ్ చేస్తున్నారా అంటూ అడిగేసాడు. దానికి ఈ భామ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేను అని.. ఒకప్పుడు ప్రేమ లో ఉన్నా కూడా ఇప్పుడు తన ప్రేమ అంతా సినిమాలపైనేనని వాటితోనే ప్రేమలో ఉన్నాను అని చెప్పింది సాయి పల్లవి. ఇక సహజీవనం గురించి కూడా మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ. తనకు సహజీవనం అంటే నచ్చదని.. అలాగని తను దానికి వ్యతిరేకం కాదని.. తన జీవితంలో సహజీవనం అనే కాన్సెప్ట్ కంటే కూడా పెళ్లి అనే దానికి విలువ ఇస్తాన‌ని చెప్పింది ఈ ఫిదా బ్యూటీ. మొత్తానికి లివ్ ఇన్ రిలేషన్ షిప్ తప్పు కాదు అంటూనే తాను మాత్రం పెళ్లి చేసుకుంటాను.. దీనిపై న‌మ్మ‌కం లేద‌ని తేల్చిచెప్పింది సాయిప‌ల్ల‌వి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *