సాహోకు స్వాతంత్ర్యం.. ప్ర‌భాస్ తీపిక‌బురు..

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ తెలుగు హీరో కాదు. ఇప్పుడు ఈయ‌న ఇండియ‌న్ హీరో. బాలీవుడ్ హీరోల‌కు కూడా సాధ్యం కాని రికార్డుల‌ను చాలానే సెట్ చేసాడు ఈయ‌న‌. దాంతో ఇటు తెలుగు.. అటు హిందీలో మార్కెట్ సొంతం చేసుకుని స‌రికొత్త సూప‌ర్ హీరో అయ్యాడు ప్ర‌భాస్. అందుకే సాహో సినిమాతో అది అలాగే నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్.

Saaho

ఇప్పుడు ఆయన రేంజ్ కూడా అలా పెరిగిపోయింది మ‌రి. అందుకే సాహోకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా 200 కోట్ల బ‌డ్జెట్ ఇచ్చారు యువీ క్రియేష‌న్స్. సుజీత్ చెప్పిన క‌థ‌ను ప్ర‌భాస్ కూడా అదే రేంజ్ లో న‌మ్మాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర విడుద‌ల తేదీపై కూడా క్లారిటీ వ‌చ్చేసింది. 2019, ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది.

స్వాతంత్ర్య దినోత్స‌వం రోజే సాహోకు కూడా స్వాతంత్ర్యం ఇవ్వాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్త‌యింది. ఆ మ‌ధ్య దుబాయ్ షెడ్యూల్ లో 37 కార్లు.. 4 భారీ ట్ర‌క్కులు క్ర‌ష్ చేసి 90 కోట్లతో 25 నిమిషాల భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కించాడు సుజీత్. దుబాయ్ లో బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రించారు. ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్లుగా ఇది ఉంటుందంటున్నాడు ప్ర‌భాస్. ఆ త‌ర్వాత రుమేనియ‌న్ ఎపిసోడ్స్ కూడా అదే స్థాయిలో తెర‌కెక్కించాడు సుజీత్. ఈ చిత్రం క‌చ్చితంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో బెస్ట్ యాక్ష‌న్ మూవీగా నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం ఎన్ని సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here