సామి సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 2
Total Critics:1

AUDIENCE METER

movie-poster
Release Date
September 21, 2018

Critic Reviews for The Boxtrolls

సామి.. అర‌వ‌మేళం త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే సామీ..
Rating: 2/5

www.teluguodu.com

హ‌రి సినిమా అంటే ఎలా ఉంటుందో సింగం సిరీస్ తోనే బాగా అర్థ‌మైపోయింది. ఆయ‌న సినిమాల్లో క‌థ‌లు కొత్త‌గా ఉండ‌వు కానీ క‌చ్చితంగా క‌థ‌నం మాత్రం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలుసు. మ‌రి ఇప్పుడు సామితో ప‌దిహేనేళ్ల త‌ర్వాత సీక్వెల్ చేసాడు ద‌ర్శ‌కుడు హ‌రి. మ‌రి ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి విజ‌యం అందుకుంది..? అస‌లు ఆక‌ట్టుకుందా.. లేదా..?

క‌థ‌:
ప‌రుశురామ స్వామి(విక్ర‌మ్) విజ‌య‌వాడ‌లోని బిక్షు(కోట శ్రీ‌నివాస‌రావు)ను చంపేసి సిటీని క్లీన్ చేస్తాడు. కానీ ఆయ‌న కొడుకు రావ‌ణ బిక్షు(బాబీసింహా) వ‌చ్చి మ‌ళ్లీ రౌడీయిజాన్ని నిద్ర లేపుతాడు. అలాగే ప‌రుశురామ స్వామి, అత‌డి భార్య భువ‌న‌(ఐశ్వ‌ర్యా రాజేష్)ను కూడా చంపేస్తాడు.

28 ఏళ్ళ త‌ర్వాత స్వామి కొడుకు రామ‌స్వామి (విక్ర‌మ్) తిరిగి బెజ‌వాడుకు పోలీస్ ఆఫీస‌ర్ గా వ‌స్తాడు. ఢిల్లీలో ఉన్న‌పుడే స్వామిని చూసి ఇష్ట‌ప‌డుతుంది సెంట్ర‌ల్ మినిష్ట‌ర్ కూతురు దియా(కీర్తిసురేష్). కానీ స్వామి మాత్రం ప‌ట్టించుకోడు. బెజ‌వాడ వ‌చ్చేస్తాడు. వ‌చ్చీ ఇక్క‌డ రావ‌ణ బిక్షుతో స‌వాల్ కు దిగుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది..? అస‌లు దియాకు స్వామి ద‌క్కాడా లేదా.. రావ‌ణ బిక్షు చేసిన దారుణాలేంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఓ క‌థ‌కు సీక్వెల్ చేయ‌డం చాలా క‌ష్టం అంటుంటారు ద‌ర్శ‌కులు.. అదేంటో కానీ హ‌రి మాత్రం నీళ్లు తాగినంత ఈజీగా చేస్తుంటాడు.. ఏదో బిర్యానీలో మ‌సాలాలు క‌లిపేసిన‌ట్లు.. సినిమాలో క‌లిపేస్తుంటాడు. అయితే కొన్నిసార్లు ఆ మ‌సాలాలు ఎక్కువైనా మంట పుడుతుంది..

ఇప్పుడు సామి విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. 15 ఏళ్ల కింద వ‌చ్చిన సామికి ఇది సీక్వెల్.. క‌థ కొన‌సాగింపు ఉంది కానీ.. ఆ సామిలో ఉండే క‌థ‌నం.. ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు ఇందులో క‌రువ‌య్యాయి. ఏదో ఓ సినిమా ముందు చేసేద్దాం అనే ఆత్రంలో చేసారేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే.. సింగం సిరీస్ లో క‌నిపించే ఫైట్లు.. అక్క‌డ ఉండే స్క్రీన్ ప్లే ఇక్క‌డా రిపీట్ అయ్యాయి. కాక‌పోతే హీరో మారాడంతే.. సూర్య ప్లేస్ లో విక్ర‌మ్ వ‌చ్చాడు.

ఆ క‌థ‌లో క‌నిపించే ఇంటెన్సిటీ ఇక్క‌డ మిస్ అయిన‌ట్లు అనిపించింది. హ‌రి గ‌త సినిమాల్లో కూడా పాత క‌థ‌లే ఉండేవి కానీ ఎంతోకొంత క‌థ‌లు ఉండేవి.. అందులో మ‌సాలా ఉండేది. కానీ సామిలో క‌థ లేదు.. చిన్న పాయింట్ తీసుకుని ఎంత‌సేపూ అక్క‌డే తిప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఫ‌స్టాఫ్ ల్యాగ్ అనిపించినా.. సెకండాఫ్ హీరో, విల‌న్ మ‌ధ్య సీన్స్ బాగున్నాయి. ఓ అర‌గంట సేపు హ‌రి త‌న మార్క్ ప‌క్కాగా చూపించాడు. ఇది కదా కావాల్సింది అనుకునేలోపు నీరు గార్చేసాడు. విక్ర‌మ్ చాలా ఏళ్ళ త‌ర్వాత ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో క‌నిపించాడు.. క‌థ‌కు సంబంధం లేని సూరి కామెడీ చిరాకు తెప్పిస్తుంది. ఓవ‌రాల్ గా ఈ సామి హ‌రి మార్క్ కోరుకునే వారికి ప‌ర్లేదు కానీ మిగిలిన వాళ్లకు అర‌వ మేళ‌మే..

న‌టీన‌టులు:
విక్ర‌మ్ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. పోలీస్ ఆఫీస‌ర్ గా చాలా ఏళ్ల త‌ర్వాత క‌నిపించాడు. ఈ ఏజ్ లో కూడా ఫిజిక్ మెయింట‌నెన్స్ అదిరిపోయింది. సామి పాత్ర‌లో జీవించాడు విక్ర‌మ్.

కానీ క‌థ స‌హ‌క‌రించ‌లేదు. బాబీసింహా విల‌నిజం పీక్స్ లో ఉంది. ఆయ‌న మ‌న స‌రైనోడులో ఆదిని గుర్తు చేసాడు. ఇక కీర్తిసురేష్ అయితే పూర్తిగా పాట‌ల‌కే ప‌రిమితం అయిపోయింది. ఆమెను న‌టిగా వాడుకోలేదు హ‌రి. ఐశ్వ‌ర్యా రాజేష్ ఉన్న‌ది కాసేపే అయినా బాగుంది. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం:
దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అంటే ఉండే ఊపు ఈ సినిమాలో అస్స‌లు క‌నిపించ‌దు. ఒక్క పాట‌లో కూడా మున‌ప‌టి జోష్ లేదు. ముఖ్యంగా మెట్రో రైల్ పాట ఒక్క‌టే కాస్త న‌యం. మిగిలిన‌వ‌న్నీ దేవీ చేతులు దులిపేసుకున్నాడు.

హ‌రి సినిమా అంటే క‌థ‌తో పాటే కెమెరాలు కూడా ప‌రుగులు పెడుతుంటాయి. దానికి కార‌ణం ఆయ‌న సినిమాటోగ్ర‌ఫ‌ర్ ప్రియ‌న్. 15 ఏళ్లుగా ఆయ‌న‌తోనే ప‌ని చేస్తున్నారు ఈయ‌న‌. అయితే ప్రియ‌న్ మ‌ర‌ణం ఈ సినిమా కెమెరా డిపార్ట్ మెంట్ పై ప‌డింది. ఆ స్పీడ్ సామీలో క‌నిపించ‌లేదు. ద‌ర్శ‌కుడిగా కూడా హ‌రి చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. పాత క‌థ‌ను మ‌రింత పాత‌గా చెప్పాడు.

చివ‌ర‌గా:
సామి.. అర‌వ‌మేళం త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే సామీ..

రివ్యూ: సామి
న‌టీన‌టులు: విక్ర‌మ్, కీర్తిసురేష్, బాబీసింహా, ఐశ్వర్యా రాజేష్, సూరి త‌దితరులు
సంగీతం: దేవీ శ్రీ ప్ర‌సాద్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: ప‌్రియ‌న్(మ‌ధ్య‌లో చ‌నిపోయాడు).. ఏ వెంక‌టేశ్
క‌థ, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: హ‌రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here