సైరా అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందా.. సాహోను వెంటాడుతుందా..?

అదేంటి.. సాహోతో చిరంజీవికి ఏంటి ప‌ని అనుకుంటున్నారా..? ఒక్క‌సారి రేస్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రైనా ఒక్క‌టే. ఇక్క‌డ చిన్నా పెద్ద అనే తేడా అస్స‌లు ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌భాస్, చిరంజీవి పోటీ కూడా ఇదే. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Saaho Release date confirmed is sye raa out of race?

పైగా ఇద్ద‌రూ తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలే చేస్తున్నారు. చిరంజీవి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ జీవిత చ‌రిత్ర సైరా న‌ర‌సింహారెడ్డిలో న‌టిస్తుంటే.. ప్ర‌భాస్ సాహో అంటే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో వ‌స్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఇప్ప‌టికే 60 శాతం పూర్తైపోయాయి. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుద‌ల తేదీల‌కు క్లాష్ వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే సాహో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌ని క‌న్ఫ‌ర్మ్ చేసారు. విడుదల తేదీ కూడా ఇచ్చారు.

ఇక ఇప్పుడు చిరు కూడా సైరాను స్వాతంత్ర్య దినోత్స‌వం రోజు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సినిమా క‌థ అదే కాబ‌ట్టి.. దేశ‌భ‌క్తి ఉంటుంది కాబ‌ట్టి ఆ రోజు వ‌స్తే చాలా బాగుంటుంది అనేది చిరు ఆలోచ‌న‌. మ‌రోవైపు సాహో కూడా లాంగ్ వీకెండ్ ఉంటుంది.. వ‌సూళ్లు బాగా వ‌స్తాయి కాబ‌ట్టి అదే రోజు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. అయితే సైరా విష‌యంలో అది అనుకున్నంత ఈజీ కాదు.

ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం షూటింగ్ మాత్ర‌మే పూర్త‌యింది. పాట‌ల చిత్రీక‌ర‌ణ ఇంకా మొద‌లుపెట్ట‌లేదు.. మ‌రోవైపు రీ రికార్డింగ్ మొద‌లు కాలేదు. గ్రాఫిక్స్ అలాగే ఉన్నాయి. ఏడు నెల‌ల్లోనే ఇవ‌న్నీ పూర్త‌వుతాయా అంటే అనుమాన‌మే. దాంతో ఇప్పుడు సైరాను ద‌స‌రా బ‌రిలో ఉంచాలనేది వాళ్ల ఆలోచ‌న‌. అప్ప‌టి వ‌ర‌కు కూడా రాక‌పోతే మాత్రం 2020 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. అయితే మ‌రీ అంత ఆల‌స్యం అయితే కూడా మంచిది కాద‌నే ఉద్దేశంతో ఉన్నాడు చిరంజీవి. మ‌రి చూడాలిక‌.. సైరా ఎప్పుడు వ‌స్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here