డ‌ర్టీపిక్చ‌ర్ డైరెక్ట‌ర్ చేతిలో ఆర్ఎక్స్ 100 రీమేక్..

తెలుగులో ఈ ఏడాది వ‌చ్చిన సంచ‌ల‌న చిత్రాల్లో మ‌రో అనుమానం లేకుండా ముందు వ‌ర‌స‌లో ఉండే సినిమా ఆర్ఎక్స్ 100. హీరో కూడా ఎవ‌రో తెలియ‌ని సినిమాకు ఈ చిత్రం 12 కోట్లు షేర్ తీసుకొచ్చింది. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ జంట‌గా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఈ చిన్న సినిమాకు బ్ర‌హ్మ‌రథం కాదు.. దానికి మించిన ర‌థం ప‌ట్టారు కుర్రాళ్లు. అందులో ఉన్న బూతుతో పాటు కంటెంట్ కు కూడా బాగానే ప‌డిపోయారు.

rx100

అమ్మింది 2.70 కోట్ల‌కు అయితే.. ఫుల్ ర‌న్ లో అన్నీ క‌లిపి దాదాపు 15 కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే దాదాపు అర‌డ‌జ‌న్ రెట్లు ఎక్కువ సంపాదించారు. హాట్ సీన్స్ తో పాటు లిప్ లాక్స్ ఉండ‌టంతో సాధార‌ణంగానే యూత్ ఈ చిత్రం వైపు అడుగేసారు ప్రేక్ష‌కులు. ఆర్ఎక్స్ 100 జోరు ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా వెళ్ల‌నుంది. అక్క‌డ ఒక‌ప్ప‌టి హీరో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ఈ చిత్రం రీమేక్ తోనే బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇక ఇప్పుడు ఈ చిత్ర రీమేక్ ను మిల‌న్ లూథ్రియా తీసుకున్నాడు. డ‌ర్టీపిక్చ‌ర్, వ‌న్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై లాంటి సినిమాల‌తో ఈయ‌న మెప్పించాడు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100ను ఈయ‌న డీల్ చేయ‌బోతున్నాడు. మ‌రి తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి ర‌చ్చ చేయ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here