ఆర్ఆర్ఆర్.. మ‌ల్టీస్టార‌ర్ షూటింగ్ అప్ డేట్స్..

అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్న ది లెజెండ‌రీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ ఓపెన్ అయింది. రాజ‌మౌళి రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల‌తో దాన‌య్య నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 11 ఉద‌యం 11 గంట‌ల 11 నిమిషాల‌కు ముహూర్తం జ‌రుపుకుంది ఈ చిత్రం. చిరంజీవి క్లాప్ కొట్ట‌గా.. రాఘ‌వేంద్ర‌రావ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సాధార‌ణంగా చ‌వితి రోజు ఏ ప‌నులు కూడా మొద‌లు పెట్ట‌రు. ఎందుకో ఆ రోజు నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది కానీ రాజ‌మౌళి మాత్రం ఏరికోరి ఈ తేదీనే త‌న మ‌ల్టీస్టార‌ర్ కు ఎంచుకున్నాడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో పాటు త‌న జాత‌క‌రీత్యా ఈ చిత్రానికి 11.11.11 అయితేనే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని జ్యోతిష్కులు జ‌క్క‌న‌కు చెప్పార‌ని తెలుస్తుంది. అందుకే ఇదే రోజు త‌న సినిమా మొద‌లుపెట్టాడు రాజ‌మౌళి.

RRR movie Launch Photos
RRR movie Launch Photos

ఇక‌ ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ 19 నుంచి మొద‌లు కానుంది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఈ షెడ్యూల్లో పాల్గొన‌బోతున్నారు. యాక్ష‌న్ సీన్స్ తోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. రామ రావ‌ణ రాజ్యం అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ఈ ఓపెనింగ్ వేడుక‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్రభాస్‌, రానా, కళ్యాణ్‌ రామ్‌, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, వెంకీ అట్లూరి, మెహర్‌ రమేశ్‌, దిల్‌రాజు, అల్లు అరవింద్‌, పివిపి, శోభుయార్లగడ్డ, యు.వి వంశీ, యు.వి విక్రమ్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.సురేశ్‌ బాబు, ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, నవీన్‌ ఎర్నేని, సి.వి.మోహన్‌, యలమంచిలి రవిశంకర్‌, పరుచూరి ప్రసాద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, సాయికొర్రపాటి, గుణ్ణం గంగరాజు తదితరులు హాజరయ్యారు. చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌చ్చి క్లాప్ కొట్టారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. స‌రికొత్త చ‌రిత్రకు నాందీ ప‌లుకుతున్న రాజ‌మౌళి.. ఈ చిత్రాన్ని ఎలా తెర‌కెక్కించ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here