చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు ఇంకా క‌థే చెప్ప‌లేదు..

ఆర్ఆర్ఆర్ సినిమా మ‌రికొన్ని గంట‌ల్లో ఓపెనింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి రామ రావ‌ణ రాజ్యం అనే టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నాడు రాజ‌మౌళి. జ‌క్క‌న ఏం చేసినా ఇప్పుడు సంచ‌ల‌న‌మే. ఆయ‌నేం చేసినా కూడా ఇప్పుడు అడిగేవాళ్లు కూడా లేరు. ఇప్పుడు రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌గడం పిచ్చి విష‌య‌మే. ఎంత వ‌చ్చింది.. ఎంత తెస్తుంది.. ఇంకెన్ని రికార్డులు వ‌స్తాయ‌ని అడ‌గాలి.

rrr

అలా మారిపోయింది ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడి బ్రాండ్. ఈయ‌న సినిమా అంటే క‌లెక్ష‌న్లు అలా వ‌చ్చేస్తాయంతే. ఇప్పుడు రాజ‌మౌళి ఆఫ‌ర్ ఇస్తానంటే క‌థ కూడా అడ‌గ‌రు హీరోలు. ఇదేదో మాట వ‌ర‌స‌కు అనే మాట కాదు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో ఈయ‌న సినిమా చేస్తున్నాడు క‌దా దానికి ఇంకా క‌థ కూడా చెప్ప‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. అదే వేరే ద‌ర్శ‌కుడు అయ్యుంటే ముందు చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఒప్పుకునేవాళ్లు కాదేమో..? అస‌లు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ తో సినిమా చేసే ధైర్యం ఏ ద‌ర్శ‌కుడు చేయ‌డు కూడా. కానీ జ‌క్క‌న్న ఇప్పుడు చేస్తున్నాడు.

అటు చ‌ర‌ణ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ద‌ర్శ‌క‌ధీరున్ని క‌థ ఏంట‌ని అడిగే ధైర్యం కూడా చేయ‌లేదు. ఎందుకంటే ఆయ‌న‌పై అంత న‌మ్మ‌కం మ‌రి. అయితే ఎంత వ‌ద్ద‌న్నా వాళ్లు కూడా స్టార్ హీరోలే. ఇప్ప‌టి వ‌ర‌కు క‌థేంటో చెప్ప‌క‌పోయినా లైన్ మాత్రం చెప్పాడు రాజ‌మౌళి. ఓపెనింగ్ జ‌రుప‌పుకుంటున్న సినిమాకు కూడా క‌నీసం క‌థ అడ‌గ‌లేదు అంటే ద‌ర్శ‌కుడి పెత్త‌నం ఎంత సాగుతుంది అనేది అర్థం చేసుకోవ‌చ్చు.. పెత్త‌నం కంటే కూడా న‌మ్మ‌కం అనాలేమో..? ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను ఒక‌ద‌గ్గ‌ర చేర్చి క‌థ చెప్ప‌డం అనేది చిన్న విష‌యం కాదు. త్వ‌ర‌లోనే ఇది చేయ‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. ఓపెనింగ్ జ‌రిగిన త‌ర్వాత ఇద్ద‌రు హీరోల‌ను పిలిచి పూర్తిక‌థ చెప్ప‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. న‌వంబ‌ర్ 11 నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. 2020లో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి.. ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను పెట్టి రాజ‌మౌళి ఎలాంటి క‌థ చేస్తాడో..? ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య 300 కోట్ల‌తో నిర్మించ‌బోతున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here