రాస్కోరా సాంబ‌.. రాజ‌మౌళి హీరోయిన్లు వాళ్లే..

రాజ‌మౌళి మెల్ల‌గా త‌న త‌ర్వాతి సినిమాపై దృష్టి పెంచుతున్నాడు. ఇన్ని రోజులు కొడుకు పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ పై కూడా క‌న్నేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. పైగా రాజ‌మౌళి సినిమా అంటే ఇండియ‌న్ వైడ్ ట్రెండింగ్ ఇప్పుడు.

#RRR Gets First Female Actress on Board

బాహుబ‌లి ప్ర‌భావం అలా ఉంది ఏం చేస్తాం మ‌రి..! ప్ర‌స్తుతం చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నా కూడా హిందీకి వాళ్లు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా బిజినెస్ మాత్రం అద్భుతంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర క‌థ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను క‌ల‌ప‌డం అంటే ఎంత క‌ష్ట‌మో రాజ‌మౌళికి తెలియంది కాదు.. అందుకే వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసేలా ఎక్క‌డా త‌గ్గ‌కుండా క‌థ సిద్ధం చేస్తున్నాడు జ‌క్క‌న్న‌.

ఇందులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ త‌ప్ప మిగిలిన వాళ్ళెవ‌రూ అనేది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు ఇందులో హీరోయిన్ల‌పై చిన్న క్లారిటీ వ‌చ్చేసింది. ఇందులో హీరోయిన్లుగా ఎవ‌రు న‌టించ‌బోతున్నార‌నే విష‌యంపై ఎన్నో చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. ఒక‌రు చ‌ర‌ణ్ కు.. మ‌రొక‌రు ఎన్టీఆర్ కు..! ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి క‌న్ను మ‌హాన‌టిపై ప‌డిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

కీర్తిసురేష్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయిన ద‌ర్శ‌క‌ధీరుడు.. త‌న సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఈ భామ‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ర‌కుల్ ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మ‌న‌సు మార్చుకుని కైరా అద్వానీ వైపు అడుగేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇప్ప‌టికే బోయ‌పాటి సినిమాలో క‌లిసి న‌టిస్తున్న ఈ జోడీని ఇప్పుడు మ‌రోసారి కంటిన్యూ చేయ‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ 12న ఈ విష‌యం క‌న్ఫ‌ర్మ్ చేయ‌నున్నాడు రాజ‌మౌళి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here