ర‌జినీకాంత్ సంచ‌ల‌నం.. 2.0పై సెన్సేష‌న‌ల్ క‌మెంట్స్..

ర‌జినీకాంత్ త‌న సినిమాల‌కు ప్ర‌మోష‌న్ ఎక్కువ‌గా చేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో అయితే చూడ‌లేదు. ఆయ‌న సినిమా చేయ‌డ‌మే పెద్ద ప్ర‌మోష‌న్. ఇంకా ఆయ‌న ప్ర‌త్యేకంగా బ‌య‌టికి వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేయ‌డం ఏంటి విడ్డూరం కాక‌పోతేనూ..? క‌బాలి లాంటి సినిమాల‌కు అయితే క‌నీసం ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌లేదు. అది ర‌జినీ రేంజ్. అయితే ఇప్పుడు 2.0కు మాత్రం రిస్క్ తీసుకోవ‌డం లేదు.

2point0

ఎందుకంటే ఈ చిత్రం 500 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది.. పైగా ర‌జినీ కూడా హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక బ‌య‌టికి వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు ఇందులో భాగంగానే 2.0 గురించి సంచ‌ల‌న క‌మెంట్స్ చేసాడు ర‌జినీకాంత్.

అస‌లు ఇది రోబో సినిమాకు సీక్వెల్ కాద‌ని.. అంతా అలా త‌ప్పుగా అనుకుంటున్నార‌ని బాంబ్ పేల్చాడు. ఇది సీక్వెల్ కాక‌పోతే మ‌రేంటి.. మ‌రీ పిచ్చి కాక‌పోతూనూ అనుకున్నా ప‌ర్లేదు కానీ దానికి క్లారిటీ కూడా ఇచ్చాడు సూప‌ర్ స్టార్. 2.0 అనేది పూర్తిగా కొత్త క‌థ అని.. అస‌లు రోబోతో సంబంధ‌మే లేద‌ని చెప్పాడు. అక్క‌డ ఎమోష‌న్స్ బేస్డ్ గా క‌థ సాగితే ఇక్క‌డంతా అక్ష‌య్ కుమార్ కుమ్మేసాడ‌ని గుర్తు చేసుకున్నాడు .అస‌లు ఈ చిత్రానికి ఆయ‌నే హీరో విల‌న్ అని చెప్పాడు ర‌జినీకాంత్. సూప‌ర్ స్టార్ అంత‌టి హీరోనే అక్ష‌య్ కుమార్ తో పాటు సినిమా క‌థ‌ను కూడా ఇలా చెప్పిన‌పుడు అంతా అత‌న్ని ఫాలో అయిపోవ‌డం త‌ప్ప ఇంకేం చేస్తారు. మొత్తానికి చూడాలిక‌.. ర‌జినీ చెబుతున్న ఆ మార్పు.. రోబోతో సంబంధం లేని 2.0 ఎలా ఉండ‌బోతుందో న‌వంబ‌ర్ 29న తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here