నాకు ఆ బాబు కావాలంటున్న ఆర్జీవీ..

ఏ బాబు.. ఎవ‌రికి బాబు.. అయినా వ‌ర్మ‌కు బాబు ఎందుకు అనే అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా. అక్క‌డున్న‌ది వ‌ర్మ‌.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఎవ‌ర్నైనా వాడేసుకుంటాడు.. ఎలా ఉన్నా వాడేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసి చూపిస్తున్నాడు వ‌ర్మ‌. ఈయ‌న కావాల‌నే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ను మ‌ళ్లీ తెర‌పైకి తీసుకొస్తున్నాడు. ఇన్నాళ్లూ చాలా సైలెంట్ గా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు.. రెండు రోజులుగా మ‌ళ్లీ ర‌చ్చ చేస్తున్నాడు.

RGV

జ‌న‌వ‌రి 25న త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ‌.. ఇప్పుడు డూప్ చంద్ర‌బాబు కావాలంటున్నాడు.కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో స‌ర్క్యులేట్ అవుతుంది. హోట‌ల్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తి అచ్చం చంద్ర‌బాబులాగే ఉన్నాడు. అత‌న్ని చూసి నిజంగానే చంద్ర‌బాబునాయుడా ఏంటి అని మ‌న క‌ళ్ళ‌ను మ‌న‌మే మోసం చేసుకోవాలేమో..? ఇప్పుడు ఆయ‌న అడ్ర‌స్ కావాలంటున్నాడు వ‌ర్మ‌. అత‌డ్ని కానీ ప‌ట్టిస్తే వాళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లిస్తానంటున్నాడు. అస‌లు వ‌ర్మ ఇచ్చిన ఈ ఆఫ‌ర్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. కావాలనే ఇప్పుడు చంద్ర‌బాబును వాడుకుని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు క్రేజ్ తెచ్చుకుంటున్నాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. వ‌ర్మ బాబును ఎవ‌రు ముందుగా ప‌ట్టిస్తారో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here