టిడిపి నేత‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన వ‌ర్మ‌..

కొట్టాలని కోపంతో రాయి విసిరితే.. అదే రాయి తీసుకొని ఇల్లు కట్టుకునే రకం వర్మ. అందుకే ఆయన్ని గెలక‌డానికి అంతా భయపడుతుంటారు. లేనిపోని కర్మ ఈ వర్మతో ఎందుకు మ‌న‌కు అని అంత సైలెంట్ అయిపోతుంటారు. తన పాపాన తనే పోతాడు లేని వదిలేస్తారు. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్లు మాత్రం వ‌ర్మ‌ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఆయన కూడా వాళ్ళను సీరియస్ గా తీసుకున్నాడు.

RGV Response On TDP Leaders

మొన్నటికి మొన్న వెన్నుపోటు సాంగ్ విడుదల చేసి చంద్రబాబునాయుడుని టార్గెట్ చేశారు ఆర్జీవి. దాంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు ఈ దర్శకుడిపై చాలా కోపం ఉంది. అందులో చాలా మంది తిట్టి అంత‌టితో ఊరుకున్నారు.. కాని ఎస్వీ మోహన్ రెడ్డి అనే టిడిపి నేత మాత్రం వర్మపై కాస్త అత్యుత్సాహంతో పరువు నష్టం దావా వేశాడు. వర్మ వ్యాఖ్యలతో తమ నాయకుడి పరువుకు భంగం వాటిల్లింద‌ని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

దాంతో ఇప్పుడు వర్మ రంగంలోకి దిగాడు. టిడిపి నేత ఎస్వీ మోహన్ రెడ్డితో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. చంద్రబాబుని తిడితే నీ పరువు ఎలా పోయింది నాయనా అంటూ సెటైర్లు వేస్తున్నారు వర్మ. అయినా ఎవరి ప‌రువుకు వాళ్లే బాధ్యులు.. వాళ్లే వ‌చ్చి కేస్ పెట్టాలి కానీ ఎవరు పడితే వారు పెడితే కేసు నిలబడదు అంటూ సెటైర్లు వేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇదే విషయాన్ని వర్మ తరపు లాయర్ కూడా పోలీసులకు చెప్పాడు.

48 గంటల్లో ఎస్వీ మోహన్ రెడ్డి తాను పెట్టిన కేసును వెన‌క్కి తీసుకోకపోతే ఆయనపై తిరిగి వ‌ర్మే పరువు నష్టం దావా వేస్తాడ‌ని హెచ్చరించాడు లాయర్. మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల తన క్లయింట్ వర్మ మానసిక వేదనకు గురవుతున్నారని.. అందుకే 48 గంట‌ల్లో కేస్ విత్ డ్రా చేసుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాడు వర్మ తరపు లాయర్. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో రానున్న రోజుల్లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here