లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇది వ‌ర్మ బ్రాండ్ గురూ..

ఎవరికైనా వివాదాన్ని చూస్తే భయమేస్తోంది కానీ వర్మను చూస్తే వివాదానికి భయమేస్తుంది. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తే అదే అనిపిస్తుంది. లేకపోతే మరేంటి.. తెలుగుదేశంతో కావాలనే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు ఈ సంచలన దర్శకుడు. తన సినిమా ప్రమోషన్ కోసం అవసరం అయితే ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం అనేలా దూసుకుపోతున్నాడు ఆర్జీవి. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్లో భాగంగా తెలుగు తమ్ముళ్లతో రోజూ వర్మకు గొడవలు అవుతూనే ఉన్నాయి.

అయినా కూడా ఈ దర్శకుడు వెనక్కి తగ్గడం లేదు. సమరసింహారెడ్డిలో జయ ప్రకాష్ రెడ్డి చెప్పినట్టు చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటున్నాడు వ‌ర్మ‌. మధ్యలో లెజెండ్ సినిమా డైలాగులు కూడా వాడుకుంటున్నాడు ఈయ‌న‌. మీరు భయపడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది అల్లాటప్పా కాదు వర్మ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు సవాల్ విసురుతున్నాడు ఈ దర్శకుడు.

rgv open challenge on lakshmis ntr

అక్కడితో ఊరుకోకుండా మొరిగే కుక్కలు ఎప్పుడూ క‌ర‌వ‌వు అంటూ వాళ్ళని ఇంకాస్త రెచ్చగొడుతున్నాడు వర్మ. దాంతో ఈ రచ్చ ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరేం చేసినా ఎంత అన్న వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా జనవరి 24 న వస్తుంది. అందులో ఎన్టీఆర్ ఎలా చనిపోయాడో అసలు నిజాలు చూసి తెలుసుకోండి అంటూ ఇప్పటి నుంచే ఆసక్తి పెంచేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇందులో చంద్రబాబునాయుడు పాత్రను తాను విలన్ గా చూపించానా లేదా అనేది సినిమా చూసిన తర్వాత చూసి మీరే తెలుసుకోండి అంటూ మ‌రో అనుమానం వ‌దిలేసాడు వ‌ర్మ‌. ఈయ‌న తీరు చూస్తుంటే తెలుగుదేశం తమ్ముళ్లు వెనక్కి తగ్గినా కూడా వర్మ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే తన సినిమాకు ఫ్రీ ప్రమోషన్ కావాలి కదా.. అందుకే మీరు ఆపిన నేను ఆప‌ను అంటూ అలాగే దూసుకెళ్లి పోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఇన్ని సంచ‌ల‌నాల మ‌ధ్య వ‌స్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here