వ‌ర్మ‌లో కూడా మాన‌వత్వం ఉందండోయ్..

వర్మ అనే పేరు వినగానే ఎందుకో తెలియదుగానీ నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది కాబట్టి. ఎప్పుడూ సంచలనాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాడు ఆర్జీవి. అందుకే ఈ జీవి అప్పుడప్పుడు నిజాలు మాట్లాడినా కూడా ఎవరూ పట్టించుకోరు. అలాంటి వ‌ర్మ ఇప్పుడు ఓ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడేసాడు. ఈ ద‌ర్శ‌కుడి మనసు దోచుకున్న ఆ సినిమా కేజిఎఫ్.

RGV Congratulates Team KGF For the movie hit

కన్నడ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది ఈ సినిమా. తెలుగు, తమిళ, హిందీల్లో కూడా దండయాత్ర చేస్తుంది కేజిఎఫ్. ఇలాంటి సమయంలో వర్మ ఈ సినిమా చూసి ట్విట్ట‌ర్లో తోషాన్ని వ్యక్తం చేశాడు. మంచి కథ ఉంటే భాష‌తో పని లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు విజయాలు సాధిస్తాయని కేజిఎఫ్ మరోసారి నిరూపించింది అని చెప్పాడు వర్మ.

కథలో హీరో ఓ భాగంగా ఉండాలే కానీ.. హీరో చుట్టే కథ కాదు.. అలా తిరిగిన రోజు సినిమాలు చరిత్రలో కాదు చెత్తబుట్టలో నిలుస్తాయని సెటైర్లు వేశాడు ఈ సంచలన దర్శకుడు. అప్పట్లో బాహుబలి.. తర్వాత 2.0.. ఇప్పుడు కేజిఎఫ్.. ఈ మూడు సినిమాల్లో కథే హీరోగా నిలిచింది కాబట్టి భాషతో పనిలేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ విజయం సాధించాయ‌ని చెప్పాడు వర్మ. ఇలాంటి కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా ఆదరించడం శుభపరిణామం అని చెప్పాడు ఈ దర్శకుడు. మొత్తానికి విమర్శించడం తప్ప మరోటి తెలియని ఈ దర్శకుడు కేజిఎఫ్ ను పొగ‌డటంతో ఆ చిత్ర యూనిట్ పండగ చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here