అయ్యో పాపం ర‌వితేజ‌.. ఎలా ఉండేవాడో..?

ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ నిమా చూసిన త‌ర్వాత అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ కూడా ఇదే. ఒక‌ప్పుడు మాస్ రాజా సినిమాలంటే ఎంట‌ర్ టైన్మెంట్ క‌థ‌లోనే ఉండేది. ఆయ‌న ప్ర‌త్యేకంగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని కూడా లేదు. క‌థ‌లోనే కావాల్సినంత కామెడీ జ‌న‌రేట్ అయ్యేది. అలా క‌థ అల్లుకునేవాళ్లు ద‌ర్శ‌కులు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒక్క‌డే నాసీర‌కం క‌థ‌లు మోయ‌లేక చ‌చ్చిపోతున్నాడు ర‌వితేజ‌. తాజాగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చూస్తే ఈయ‌న క‌ష్ట‌మేంటో అర్థ‌మ‌వుతుంది. తెర‌పై కావాల్సినంత మంది క‌మెడియ‌న్లు ఉన్నా.. కామెడీ చేయ‌డానికి ర‌వితేజ కూడా ఎంతో ట్రై చేస్తున్నా క‌నీసం ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌లేక‌పోతున్నారు.

raviteja amar akbar antony pre-release review

పైగా అన‌వ‌స‌రంగా వ‌చ్చే కామెడీ సీక్వెన్సులు సినిమాపై ఉన్న ఇంప్రెష‌న్ ను కూడా చెడ‌గొట్టే స్తున్నాయి. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న త‌న‌కు శీనువైట్ల ఏదో చేస్తాడ‌ని న‌మ్మి అత‌డి మూడు ఫ్లాపుల‌ను కూడా ప‌ట్టించుకోకుండా అవ‌కాశం ఇస్తే అడ్డంగా ముంచేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉన్నాడు మాస్ రాజా. పాత క‌థ‌కు రొటీన్ స్క్రీన్ ప్లే తోడు కావ‌డంతో ర‌వితేజ సినిమాల్లో మ‌రో అత్యుత్త‌మ రొటీన్ చిత్రంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ మిగిలిపోయింది. ఈ చిత్రానికి వ‌చ్చిన టాక్ కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. అస‌లు ర‌వితేజ మార్కెట్ ఇంత దారుణంగా ఉంద‌ని ఇప్పుడిప్పుడే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈయ‌న కెరీర్ కు బ్రేక్ ఇచ్చే ద‌ర్శ‌కుడు ఎవ‌రో చూడాలిక‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *