కొత్త‌గా ఆలోచిస్తున్న ర‌వితేజ‌.. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో..

ర‌వితేజ కెరీర్ ఒక్క‌సారి తీసుకుంటే ఆయ‌న సినిమాల‌న్నింటిలో మాస్ ప్రేక్ష‌కుల కోసం చేసిన‌వే ఎక్కువ‌గా ఉంటాయి. ఎప్పుడైనా తాను కూడా న‌టున్నే అని గుర్తొచ్చి చేసిన ప్ర‌యోగాలు మాత్రం బెడిసికొట్టాయి. ఆయ‌న‌కు న‌చ్చ‌ని ప‌దం ప్ర‌యోగం. కొన్ని సినిమాలు చేసాడు కానీ అవి స‌రిగ్గా ఆడ‌క‌పోయేస‌రికి అటు వైపు కూడా చూడ‌టం మానేసాడు మాస్ రాజా. నాటి నా ఆటోగ్ర‌ఫ్ నుంచి నిన్న‌మొన్న‌టి సారొచ్చారు వ‌ర‌కు ర‌వితేజ‌కు ప్రయోగాలు పెద్ద‌గా ప‌డ‌లేదు.

ravi teja vi anand

దాంతో త‌న‌కు అవి స‌రిపోవు.. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లే క‌రెక్ట్ అని వీటితోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇవి కూడా క‌లిసి రావ‌డం లేదు. రాజా ది గ్రేట్ త‌ర్వాత వ‌చ్చిన ట‌చ్ చేసి చూడు, నేల‌టికెట్ డిజాస్ట‌ర్స్ కావ‌డంతో ర‌వితేజ‌కు ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు శీనువైట్ల‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చేస్తున్నాడు ర‌వితేజ‌. ఈ చిత్రం న‌వంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. ఇది అయిన త‌ర్వాత న‌వంబ‌ర్ 13నే కొత్త సినిమాకు ముహూర్తం పెడుతున్నాడు మాస్ రాజా.

విఐ ఆనంద్ తో సినిమా చేయ‌బోతున్నాడు ఈ హీరో. విఐ ఆనంద్ అంటే టైగ‌ర్.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ.. ఒక్క‌క్ష‌ణం లాంటి డిఫెరెంట్ సినిమాలే చేసాడే.. ఆయ‌నే. ఇప్పుడు ర‌వితేజ‌తో కూడా ఈయ‌న ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మే చేయ‌బోతున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో మాస్ రాజాను మెప్పించాడు ఈ ద‌ర్శ‌కుడు. నేల‌టికెట్ సినిమాను నిర్మించిన రామ త‌ళ్లూరి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. అన్నీ కుదిర్తే ఈ ఏడాది చివ‌ర్లో ఆనంద్- ర‌వితేజ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో ర‌వితేజ జోడీ క‌ట్ట‌బోతున్నాడు. మ‌రి ఈ సైంటిఫిక్ క‌థ మాస్ రాజాకు ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here