పాప మెల్ల‌గా ఇక్క‌డ పాగా వేస్తుందిగా..

 

చాలా మంది పాప‌లు ఉంటారు క‌దా.. అందులో ఎవ‌రీ పాప అనుకుంటున్నారా..? ఈ ఏడాది ఆర్ఎక్స్ 100 తో సంచ‌ల‌నంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది క‌దా.. పాయల్ రాజ్ పుత్. ఆ పాప గురించే ఇప్పుడు మ‌న చ‌ర్చ‌. అయినా మ‌న ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారి గుర్తింపు తెచ్చుకుంటే చాలు అంత ఈజీగా ఇక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు వ‌దిలిపెట్ట‌రు. పైగా హీరోయిన్లు కూడా అలాగే ఉంటారు. ఒక్క‌సారి తెలుగులో సినిమాలు చేయ‌డానికి అల‌వాటు ప‌డితే బాలీవుడ్ ను కూడా కాద‌నుకుని ఇక్క‌డ సెటిల్ అయ్యే వాళ్లుంటారు. కైరా అద్వానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పాయ‌ల్ రాజ్ పుత్ కూడా ఇదే చేస్తుంది. ఆర్ఎక్స్ 100తో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ఈ బెంగాలీ బ్యూటీ. అక్క‌డ కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దాంతో తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

Payal Rajput Mind Blowing Photo Shoot
ఇక్క‌డ తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. దాంతో అమ్మడు అందాల వేట ఇప్పుడు సాగుతంది. ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి ఈ మ‌ధ్యే హాట్ ఫోటో షూట్ ఒక‌టి చేసింది. ఇప్పుడు విడుద‌లైన ఈ ఫోటోలు ర‌చ్చ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు దీనికి ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. ర‌వితేజ హీరోగా విఐ ఆనంద్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో పాయ‌ల్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఇందులో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఉన్నారు. న‌న్ను దోచుకుందువ‌టే ఫేమ్ న‌భాన‌టాష్ ఇందులో న‌టించ‌నుంది. మ‌రో హీరోయిన్ ను ఎంపిక చేయాలి. మొత్తానికి చూడాలిక‌.. మాస్ రాజా అండ‌తో అయినా ఈ ముద్దుగుమ్మ ఇక్క‌డ నిల‌బ‌డుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here