రౌడీగా మారిపోయిన ర‌వితేజ కొడుకు..

ర‌వితేజ కొడుకు ఏంటి.. రౌడీగా మార‌డం ఏంటి.. ఆ కుర్రాడు ఇంకా చ‌దువుకుంటున్నాడు క‌దా ఏంటీ పిచ్చ‌వాగుడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే ర‌వితేజ కొడుకు మ‌హాధ‌న్ చ‌దువుకుంటున్నాడు కానీ రౌడీగా కూడా మారిపోయాడు. అదెలా అనుకోవ‌ద్దు.. ఇప్పుడు అభిమానుల‌ను రౌడీస్ అని ముద్దుగా పిలుచుకునే ఓ హీరో తెలుగులో వ‌చ్చాడు క‌దా.. అత‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇప్పుడు ఈయ‌న రౌడీ గ్యాంగ్ లో చేరిపోయాడు ర‌వితేజ త‌న‌యుడు మహాధ‌న్.

Ravi teja son mahadhan turns rowdy

రౌడీ టీ షర్ట్ త‌ను వేసుకోవ‌డం కాకుండా త‌న స్నేహితుల‌తో కూడా వేయించుకుని విజ‌య్ తో ఫోటో దిగాడు ఈ జూనియ‌ర్ మాస్ రాజా. ఈ మ‌ధ్యే తండ్రి ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న టాక్సీవాలాతో గుద్ది చంపేసాడు. అయినా కూడా ఇప్పుడు ఆ కుర్రాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆడుకుంటున్నాడు. ఇక త‌న బుల్లి రౌడీస్ ను చూసి విజ‌య్ కూడా మురిసిపోయాడు. మ‌హాధ‌న్ తో పాటు అత‌డి ఫ్రెండ్స్ తో కూడా సెల్ఫీ దిగాడు. త‌న రౌడీ టీ ష‌ర్ట్ వేస‌కున్నందుకు.. రౌడీస్ గా మారినందుకు థ్యాంక్స్ చెప్పాడు విజ‌య్. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ కు ఇప్పుడు సామాన్య ప్ర‌జ‌లే కాదు.. సెలెబ్రెటీస్ కూడా ప‌డిపోతున్నార‌బ్బా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here