ర‌వితేజ ఇంతగా ఎలా మారిపోయాడు..?

ఒక‌ప్పుడు ర‌వితేజపై ఇండ‌స్ట్రీలో ఓ రూమ‌ర్ ఉండేది. ఈయ‌న‌కు క‌థ విని డేట్స్ తీసుకుంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్.. క‌థ విన‌కుండా డేట్స్ ఇస్తే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడు అని. ఇది అప్ప‌ట్లో విని న‌వ్వుకునే వాళ్లు జ‌నాలు. ఎదుగుతున్నాడు కాబ‌ట్టి ఏడుస్తున్నారు అని స‌ర్దుకునే వాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు ర‌వితేజ చేస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇది నిజ‌మేనేమో అనే అనుమానం రాక‌మాన‌దు.

ravi teja up coming movies

ఒక‌ప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తే అందులో క‌నీసం ఒక్క‌టైనా హిట్ అయ్యేది. మ‌రో రెండు ఫ్లాప్ అయినా ఎంట‌ర్ టైన్మెంట్ ఉండేవి. కానీ ఇప్పుడు ర‌వితేజ సినిమాల్లో అస‌లు క‌థే క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది విడుద‌లైన ట‌చ్ చేసి చూడు కానీ.. నేల‌టికెట్ లో కానీ అస‌లు క‌థ ఎక్క‌డుంది..? ఏదో హీరోయిజంతో సినిమాను న‌డిపించేయాల‌నే ఆరాటం త‌ప్ప‌. మ‌రోవైపు ఇప్పుడు ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ పై కూడా ఇండ‌స్ట్రీలో వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి.

గ‌తేడాది రాజా ది గ్రేట్ కోసం ఆయ‌న తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కేవ‌లం 3 కోట్లే అని అప్ప‌ట్లో వినిపించిన వార్త‌. ఎందుకంటే అక్క‌డ ఉన్న‌ది దిల్ రాజు కాబ‌ట్టి. కానీ ట‌చ్ చేసి చూడుకు కానీ.. నేల‌టికెట్ కు గానీ ఈయ‌న భారీ పారితోషికం తీసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేక‌ర్స్ తో వ‌ర‌స‌గా రెండు సినిమాలు క‌మిట‌య్యాడు మాస్ రాజా. ఇందులో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది కానీ తెరీ రీమేక్ ఇంకా తెర‌కెక్క‌లేదు. ఈ రెండు సినిమాల‌కు 15 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక దాంతో పాటు ఇప్పుడు విఐ ఆనంద్ తో ఓ సినిమా క‌మిట‌య్యాడు మాస్ రాజా. ఈ చిత్రంలో ఆయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. న‌న్ను దోచుకుందువ‌టే ఫేమ్ న‌భా న‌టేష్ ఓ హీరోయిన్ గా ఫిక్సైపోయింది. మ‌రో ఇద్ద‌రి కోసం వేట సాగుతుంది. మొత్తానికి ర‌వితేజ మ‌ళ్లీ జోరు పెంచి పాత మాస్ రాజాను గుర్తు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here