క‌లిసిపోయిన ర‌ణ్ బీర్, క‌త్రినా కైఫ్.. కానీ..!

బాలీవుడ్ లో ఎవ‌రి జోడీ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. విడిపోయారు అని క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న క‌త్రినాకైఫ్-స‌ల్మాన్ ఖాన్ మ‌ళ్లీ క‌లిసిపోయారు. అయితే స‌ల్మాన్ ఖాన్ ఆరెంజ్ లో రామ్ చ‌ర‌ణ్ టైప్. ప్రేమ ఎక్కువ కాలం ఉండ‌దంటాడు.

alia bhat ranbir kapoor on Brahmastra sets
Alia Bhatt Ranbir Kapoor on Brahmastra sets

అందుకే ఉన్న‌న్ని రోజులు హాయిగా హ్యాపీగా ఉండాల‌నుకునే ర‌కం కండ‌ల‌వీరుడిది. అదేం విచిత్ర‌మో కానీ క‌త్రినాకు త‌గిలే బాయ్ ఫ్రెండ్స్ ఆరెంజ్ లో రామ్ చ‌ర‌ణ్ లాంటోళ్లే త‌గ‌లుతుంటారు. స‌ల్మాన్ త‌ర్వాత ర‌ణ్ బీర్ తో కూడా ఇలాగే క్లోజ్ అయింది క‌త్రినా. ఆయ‌న‌తో వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఇళ్లు కూడా తీసుకున్నారు కానీ ఆ త‌ర్వాత విడిపోయారు.

Katrina Kaif - Beauty in Black

ఇప్పుడు క‌త్రినా మాజీ ప్రియుడు అలియాకు మొగుడు అయ్యేలా ఉన్నాడు. అలియాభట్ తో ర‌ణ్ బీర్ క‌పూర్ ఇప్పుడు ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రూ బ్ర‌హ్మ‌స్త్ర సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. అలాగే క‌లిసి బ‌త‌కాల‌నుకుంటున్నారు కూడా. 2020లో వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌బోతుంద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అలియా, ర‌ణ్ మాత్రం అవున‌న‌డం లేదు.. అలాగ‌ని కాద‌ని కూడా చెప్ప‌డం లేదు. ఎవ‌రి ఊహ‌ల‌కు వాళ్ల‌నే వ‌దిలేస్తున్నారు. ఇక ఇప్పుడు ముంబైలోని ఓ హోట‌ల్లో ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించారు. ఇదే ర‌చ్చ జ‌రుగుతుందిప్పుడు. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే భ‌ట్ గార‌మ్మాయికి క‌పూర్ గారి కుర్రాడు మొగుడ‌య్యేలా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here