మీటూలో నా పేరు లేదేంటి.. వ‌ర్మ ఆశ్చ‌ర్యం..

బుక్కులో నా లెక్కెక్క‌డా అంటూ య‌మ‌దొంగ సినిమాలో ఎన్టీఆర్ చిత్ర‌గుప్తున్ని అడుగుతాడు క‌దా.. ఇప్పుడు అలాగే అడుగుతున్నాడు వ‌ర్మ‌. అది కూడా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం గురించి. దానిపై త‌న‌దైన శైలిలో రెచ్చిపోయాడు వ‌ర్మ‌. అయినా అంతా ఒక‌లా ఆలోచిస్తుంటే వ‌ర్మ మాత్రం ఇంకోలా ఆలోచిస్తుంటాడు.
Ram gopal varma responded on metoo movie
ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మీటూ ఉద్య‌మంలో ఎప్పుడు ఎవ‌రి పేరు బ‌య‌టికి వ‌స్తుందో అని అంతా వ‌ణికిపోతున్నారు. ఇలాంటి టైమ్ లో వ‌ర్మ మాత్రం సెటైర్లు వేస్తున్నాడు. ఈ ఉద్య‌మంలో త‌న పేరు ఎక్క‌డుందంటూ ప్ర‌శ్నిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మీటూ ఉద్య‌మంలో త‌న పేరు లేక‌పోవ‌డం.. రాక‌పోవడం.. విన‌బ‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నాడు వ‌ర్మ‌.
ఇదే బాలీవుడ్ లో చాలా మందికి నిద్ర కూడా పోనివ్వ‌డం లేదని చెప్పాడు వ‌ర్మ‌. అయినా మీటూ ఉద్యమంలో పేరు వ‌స్తే కంగారు ప‌డాలి కానీ రానందుకు బాధ ప‌డే వ‌ర్మ‌ను చూసి ఏమ‌నాలో కూడా అర్థం కావ‌డం లేదు. అదే మ‌రి ఆర్జీవి అంటే. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని.. పొద్దున్న లేస్తే తొడల గురించి.. అమ్మాయిల గురించి.. సెక్స్ గురించి మాట్లాడుతుంటాన‌ని అందుకే వాళ్లెవరూ త‌న‌ పేరు బయటకి తీసుకురాలేదేమో అన్నాడు వ‌ర్మ‌.
మ‌రి ఈయ‌న చెప్పింది కూడా నిజ‌మే. ప‌దేళ్ల‌కే అన్నీ చూసేసిన త‌ర్వాత పాతికేళ్ల‌కు టీవీ చూడ్డం త‌ప్ప ఇంకేం చేస్తాడ‌ని అత‌డు సినిమా డైలాగ్ చెప్పిన‌ట్లు వ‌ర్మ కూడా చేసే ప‌నుల‌న్నీ ఓపెన్ గా చేస్తుంటే.. ఇంక ఈ ద‌ర్శ‌కుడి మీద ఎవ‌రు మీటూ కమెంట్స్ చేసేది. ఎంతైనా వ‌ర్మ వ‌ర్మే అబ్బా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here