టైటిల్ అదే క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చా చ‌ర‌ణ్..?

రామ్ చ‌ర‌ణ్ సినిమా ఫ‌స్ట్ లుక్ ప్లస్ టైటిల్ కోసం అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పై చాలా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. న‌వంబ‌ర్ 6 మాధ్యాహ్నం 1 గంట‌ల‌కు బోయ‌పాటి శీను త‌న సినిమా టైటిల్ గురించి ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ కూడా వ‌చ్చింది.

ram charan rc12 first look
ram charan rc12 first look

బోయ‌పాటి సినిమా అంటే మాస్ టైటిల్స్ ఊహిస్తారు ప్రేక్ష‌కులు. దానికి త‌గ‌ట్టుగానే సింహా.. లెజెండ్.. ద‌మ్ము అంటూ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ బోయ‌పాటి ఖాతాలో ఉన్నాయి. అయితే ఏడాది కింది నుంచి ఎందుకో తెలియ‌దు కానీ ఈయ‌న రూట్ మార్చుకున్నాడు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాకు జ‌య జాన‌కీ నాయ‌క అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాకు కూడా ఇదే చేస్తున్నాడు బోయ‌పాటి. ఈ చిత్రానికి ఇన్ని రోజులు టైటిల్ స్టేట్ రౌడీ అని.. గ్యాంగ్ లీడ‌ర్ అని చాలానే వినిపించాయి కానీ ఇప్పుడు మాత్రం విన‌య విధేయ రామ అంటున్నారు. అయితే ఇది ఇంకా అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ మాత్రం కాలేదు.

టైటిల్ సాఫ్ట్ గా అనిపిస్తున్నా కూడా రామ్ చ‌ర‌ణ్ ఇమేజ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. కైరాఅద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మ‌రి టైటిల్ విన‌య విధేయ రామ ఉంటుందా.. లేదంటే మ‌రో టైటిల్ ఏదైనా తీసుకొస్తాడా అనేది చూడాలి. టీజ‌ర్ న‌వంబ‌ర్ 9 ఉద‌యం 10.25 నిమిషాల‌కు విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here