అఖిల్ బాధ్య‌త తీసుకుంటున్న రామ్ చ‌ర‌ణ్..

అదేంటి.. అఖిల్ బాధ్య‌త చ‌ర‌ణ్ తీసుకోవ‌డం ఏంటి తీసుకోవాల్సింది నాగార్జున క‌దా అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ హిట్టిచ్చే బాధ్య‌త‌ను మాత్రం ఇప్పుడు చ‌ర‌ణ్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. అంటే ఈయ‌న బ్యాన‌ర్ లోనే అఖిల్ తో ఓ సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రి చిరంజీవితో త‌ప్ప బ‌య‌టి హీరోల‌తో సినిమాలు నిర్మించ‌ని రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అఖిల్ సినిమా నిర్మిస్తాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుతో. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో విన‌య విధేయ రామ సినిమా చేస్తున్నాడు శీను బోయ‌పాటి. ఇప్పుడు ఈ వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చి ఈ ద‌ర్శ‌కుడితో సినిమా నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు చ‌ర‌ణ్.

ram charan to produce akhil movie

ఎలాగూ ఇప్పుడు అఖిల్ తో ఈ ద‌ర్శ‌కుడికి క‌మిట్ మెంట్ ఉంది. ఇది త‌న కొణిదెల బ్యాన‌ర్ లోనే చేయాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. ముందు దీన్ని మ‌రో నిర్మాత‌తో చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ చ‌ర‌ణ్ తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. అఖిల్ ను సొంత త‌మ్ముడిలా భావిస్తాడు మెగా వార‌సుడు. దాంతో ఇప్పుడు త‌మ్ముడికి హిట్టిచ్చే బాధ్య‌త అన్న‌య్య తీసుకుంటున్నాడు. బోయ‌పాటి శీను ఇప్ప‌టికే అఖిల్ కోసం ప‌వ‌ర్ ఫుల్ మాస్ ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఒక్క‌సారి విన‌య విధేయ రామ అయిపోయిందంటే బాల‌య్య సినిమాకు ఎలాగూ టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి ఇదే సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు బోయ‌పాటి. మ‌రి చూడాలిక‌.. కొణిదెల బ్యాన‌ర్ లో చ‌ర‌ణ్, అఖిల్ క‌ల‌యిక‌లో ఎలాంటి సినిమా రానుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here