చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా సంక్రాంతికే.. ఇది ఫిక్స్..

 

రామ్ చ‌ర‌ణ్ సినిమా సంక్రాంతికి వ‌స్తుందా రాదా.. ఇదే అనుమానాలు ఇప్పుడు అభిమానుల్లో ఉన్నాయి. ఇవి ద‌ర్శ‌క నిర్మాత‌ల వ‌ర‌కు వెళ్లిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. అందుకే వాళ్లే స్వ‌యంగా ఓ ప్రెస్ రిలీజ్ చేసారు. అందులో షూటింగ్ వివ‌రాల‌ను కూడా చెప్పారు. అంతా అనుకుంటున్న‌ట్లు ఈ చిత్రం సంక్రాంతి నుంచి వాయిదా ప‌డ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ముందు చెప్పిన‌ట్లుగానే సినిమా అదే పండ‌క్కి రావ‌డం ఖాయం అని తేల్చేసారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. న‌వంబ‌ర్ 10లోపు షూటింగ్ అంతా పూర్తైపోతుంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. రెండు పాట‌లు.. డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా న‌వంబ‌ర్ 9 నుంచి మొద‌ల‌వుతుంద‌ని క్లారిటీ ఇచ్చాడు.

ram charan
ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కూడా వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేస్తామ‌ని.. ఇది యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అంటున్నాడు బోయ‌పాటి శీను. ఇక రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆ అంచ‌నాల‌ను.. మార్కెట్ ను నిల‌బెట్టేలా ఈ చిత్రం ఉంటుంద‌ని ఆశిస్తున్నాడు. అదే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాడు కూడా. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఎఫ్ 2 సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఆ రెండింటినీ త‌న సినిమాతో ఢీ కొట్టాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here