కొర‌టాల‌తో రామ్ చ‌ర‌ణ్.. అది క‌లేనా..?

అవును.. ఇప్పుడు సీన్ చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఆవేశంలో ల‌క్ష చెబుతాం అన్నీ చేస్తామా ఏంటి అన్న‌ట్లుంది ఇప్పుడు య‌వ్వారం. లేక‌పోతే మ‌రేంటి.. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోతో రెండు సార్లు సినిమా అనౌన్స్ చేసి కూడా కామ్ గా ఉన్నాడు కొర‌టాల‌. మ‌రోవైపు ఇందులో కొర‌టాల‌తో పాటు చ‌ర‌ణ్ త‌ప్పు కూడా ఉంది.

Rama charan koratala

కొర‌టాల శివ‌తో చ‌ర‌ణ్ సినిమా అనౌన్స్ రెండేళ్లు దాటేసింది. ఘాజీ సినిమాను నిర్మించిన మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌తో క‌లిసి కొణిదెల బ్యాన‌ర్ లోనే ఈ చిత్రం ఉంటుంద‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. అంతేకాదు.. 2018 స‌మ్మ‌ర్ లో ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని అప్ప‌ట్లో చెప్పాడు చ‌ర‌ణ్. కానీ ఇప్పుడు ఈ విష‌యాన్ని ఇటు చ‌ర‌ణ్.. అటు కొర‌టాల ఇద్ద‌రూ మ‌రిచిపోయారు. సీన్ చూస్తుంటే మ‌రో రెండేళ్ల‌ వ‌ర‌కు కూడా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌దు.

నిజానికి మిర్చి త‌ర్వాత కొర‌టాల‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ముహూర్తం కూడా పెట్టారు. దీనికి బండ్ల‌గ‌ణేష్ నిర్మాత‌. కానీ క‌థ కుద‌ర‌క ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయినా.. త‌ర్వాత క‌చ్చితంగా చ‌ర‌ణ్ తో సినిమా చేస్తాన‌ని ఈ మ‌ధ్యే చెప్పిన కొర‌టాల‌.. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ఆ త‌ర్వాత మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేనుతో కొర‌టాల బిజీ అయిపోయాడు. చ‌ర‌ణ్ కూడా కొర‌టాల‌ను కాద‌ని రంగ‌స్థ‌లం చేసాడు.

ఇక ఇప్పుడు బోయ‌పాటి విన‌య విధేయ రామ చేస్తున్నాడు. దాని త‌ర్వాత రాజ‌మౌళి కోసం రెండేళ్లు రాసిచ్చేసాడు. ఇక కొర‌టాల కూడా చిరంజీవి కోసం క‌థ సిద్ధం చేసాడు. అంటే మ‌రో రెండేళ్ల వ‌ర‌కు కొర‌టాల‌, చ‌ర‌ణ్ ఒక‌రికి ఒక‌రు అస్స‌లు దొర‌క‌రు. మొత్తానికి ఈ కాంబినేష‌న్ ఇప్ప‌ట్లో చూడటం క‌ష్ట‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here