మ‌గ‌ధీర‌లో 100 మందే.. విన‌య విధేయ రామ‌లో 500 మంది.

ఒక్క సినిమాతోనే మ‌ళ్లీ త‌న దారి మార్చుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంలో పూర్తిగా కొత్త రామ్ చ‌ర‌ణ్ ను చూపించిన ఈయ‌న‌.. ఇప్పుడు బోయ‌పాటి శీను కోసం మ‌ళ్లీ పాత రామ్ చ‌ర‌ణ్ ను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు. అదే మాస్ హీరోలా రెచ్చిపోతున్నాడు. మార్పు మంచికే అని ధృవ నుంచి కొత్త దారి ఎంచుకున్న రామ్ చ‌ర‌ణ్.. రంగ‌స్థ‌లంతో పీక్స్ చూపించాడు.

Ram charan fight scene with 500 people in VVR

ఈ చిత్రంలో ఆయ‌న న‌ట‌న చూసి అంతా ఫిదా అయిపోయారు. ప‌దేళ్లుగా ఇంత న‌ట‌న ఎక్కడ దాచేసావ్ చ‌ర‌ణ్ అంటూ అంతా పొగిడేసారు. ఆ సినిమా త‌ర్వాత వ‌ర‌స‌గా మ‌ళ్లీ కొత్త క‌థ‌ల వైపు అడుగు పెడ‌తానుకుంటున్న త‌రుణంలో బోయ‌పాటి సినిమా క‌మిట‌య్యాడు రామ్ చ‌ర‌ణ్. అయితే బోయ‌పాటి కూడా కాస్త కొత్త‌గా చూపిస్తాడేమోలే అనుకుంటున్న స‌మ‌యంలో ఇప్పుడు విన‌య విధేయ రామ టీజ‌ర్ విడుద‌లైంది.

ఇది చూసిన త‌ర్వాత కొత్త‌ద‌నం అనే మాట‌కు అస్స‌లు తావే లేకుండా పోయింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. బోయ‌పాటి సినిమా అంటే కొత్త‌ద‌నం మాట అటుంచితే మ‌రోసారి స‌రైనోడు సినిమా తీసిన‌ట్లు అనిపిస్తుంది.
ఇక ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న విష‌యం కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్ర ఇంట‌ర్వెల్ సీన్ ఏకంగా 500 మందితో ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి. ఈ సీన్ ఈ మ‌ధ్యే చిత్రీక‌రించాడు కూడా.

అంత‌మందితో ఫైట్ సీన్ అంటే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. ఊచ‌కోతే క‌దా.. బోయ‌పాటి దాన్ని ఎలా ప్ర‌జెంట్ చేస్తాడో తెలియ‌దు కానీ తేడా కొడితే మాత్రం క‌చ్చితంగా ముప్పుతిప్ప‌లు త‌ప్ప‌వు. ఈ సినిమాను త‌న మార్క్ మసాలాలు అన్నీ క‌లిపి సిద్ధం చేస్తున్నాడు బోయ‌పాటి శ్రీను. దాంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆ అంచ‌నాల‌ను.. మార్కెట్ ను నిల‌బెట్టేలా ఈ చిత్రం ఉంటుంద‌ని ఆశిస్తున్నాడు. అదే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాడు కూడా. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఎఫ్ 2 సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఆ రెండింటినీ త‌న సినిమాతో ఢీ కొట్టాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here