చ‌ర‌ణ్ ప‌ని ముగించుకున్నాడు తెలుసా..?

కొన్ని రోజులుగా చ‌ర‌ణ్ ఇండియాలో లేడు. ఆయ‌న్ని ఎక్క‌డో యూర‌ప్ లోని అజార్ బైజాన్ అనే దేశానికి ప‌ట్టుకుని పోయాడు బోయ‌పాటి శీను. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కంట్రీని మ్యాప్ లో కూడా చూడ‌లేదు మ‌న ప్రేక్ష‌కులు. అలాంటిది ఎలా ప‌ట్టుకున్నాడో తెలియ‌దు కానీ ప‌ట్టుకున్నాడు.. నెల రోజులుగా అక్క‌డే షూటింగ్ చేస్తున్నాడు కూడా.

ఇప్పుడు ఈ చిత్ర షెడ్యూల్ అక్క‌డ ముగిసింది. అక్టోబ‌ర్ 1నే హైద‌రాబాద్ కు వ‌చ్చేస్తున్నారు చ‌ర‌ణ్ అండ్ టీం. ఈ మ‌ధ్యే చిరంజీవి కూడా వెళ్లి టీం ను క‌లిసేసి వ‌చ్చాడు. అక్క‌డ రెండు పాటలు.. కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే చ‌ర‌ణ్ పై ఓ భారీ ఫైట్ సీన్ చిత్రీక‌రించాడు బోయ‌పాటి.

ram charan

ఇందులో భాగంగా విడుద‌లైన స్టిల్ పిచ్చెక్కించింది. ఇది చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది సినిమాలో చ‌ర‌ణ్ ఎలా ఉండ‌బోతున్నాడో..? గ్యాంగ్ లీడ‌ర్ లో చిరంజీవిలా క‌నిపిస్తున్నాడు ఈ హీరో. అన్న‌ట్లు ఈ సినిమా క‌థ కూడా గ్యాంగ్ లీడ‌ర్ మాదిరే ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఈ చిత్రంలో చ‌ర‌ణ్ అన్న‌య్య‌గా త‌మిళ్ హీరో ప్ర‌శాంత్ న‌టిస్తున్నాడు. రంగ‌స్థ‌లం ఇచ్చిన న‌మ్మ‌కంతో 100 కోట్ల‌కు పైగానే ఈ చిత్ర బిజినెస్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. ఆ వివరాలు బయటికి చెప్పనున్నాడు బోయపాటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here