చ‌ర‌ణ్ మాస్ లుక్ అదిరిపోయిందిగా..

ఒక్క హిట్ రాగానే రామ్ చ‌ర‌ణ్ తో తెలియ‌ని జోష్ వ‌చ్చేసింది. ఈయ‌న ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. సంక్రాంతి ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేద్దామా అని చూస్తున్నాడు. ఇక షూటింగ్ విష‌యంలో కూడా చాలా ఆస‌క్తితో ఉన్నాడు మెగా వార‌సుడు.

బోయ‌పాటి సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం అజ‌ర్ బైజాన్ లో జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం పేరు కూడా విన‌ని దేశానికి తీసుకెళ్లాడు ఈ ద‌ర్శ‌కుడు. అక్క‌డే నెల రోజుల పాటు షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ మ‌ధ్యే చిరంజీవి కూడా వెళ్లి టీం ను క‌లిసేసి వ‌చ్చాడు. ఏ గూగుల్ మ్యాప్ లో చూసాడో కానీ ఇప్పుడు అక్క‌డే షూటింగ్ చేస్తున్నాడు బోయ‌పాటి శీను.

Ram charan on rc 12 sets
Ram charan on rc 12 sets

రెండు పాటలు.. కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు చ‌ర‌ణ్ పై ఓ ఫైట్ సీన్ చిత్రీక‌రిస్తున్నాడు బోయ‌పాటి. ఇందులో భాగంగా ఓ స్టిల్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇది చూస్తుంటే సినిమాలో చ‌ర‌ణ్ ఎలా ఉండ‌బోతున్నాడో అర్థ‌మైపోతుంది. గ్యాంగ్ లీడ‌ర్ లో చిరంజీవిలా క‌నిపిస్తున్నాడు ఈ హీరో.

అన్న‌ట్లు ఈ సినిమా క‌థ కూడా గ్యాంగ్ లీడ‌ర్ మాదిరే ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ అన్న‌య్య‌గా త‌మిళ్ హీరో ప్ర‌శాంత్ న‌టిస్తున్నాడు. రంగ‌స్థ‌లం ఇచ్చిన న‌మ్మ‌కంతో 100 కోట్ల‌కు పైగానే ఈ చిత్ర బిజినెస్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. మ‌రి ఆ దేశంలో ఎవ‌రూ చూపించ‌ని అందాల‌ను చ‌ర‌ణ్-బోయ‌పాటి ఎంతగా ప్రేక్ష‌కుల‌కు చూపిస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here