చ‌ర‌ణ్ ను బోయ‌పాటి మ‌ళ్లీ మార్చేసాడా..?

మార్పు మంచికే అని ధృవ నుంచి కొత్త దారిలో వెళ్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంకు అది పీక్స్ కు చేరిపోయింది. ఈ చిత్రంతో ఆయ‌న న‌ట‌న చూసి అంతా ఫిదా అయిపోయారు. ప‌దేళ్లుగా ఇంత న‌ట‌న ఎక్కడ దాచేసావ్ చ‌ర‌ణ్ అంటూ అంతా పొగిడేసారు. ఆ సినిమా త‌ర్వాత వ‌ర‌స‌గా మ‌ళ్లీ కొత్త క‌థ‌ల వైపు అడుగు పెడ‌తానుకుంటున్న త‌రుణంలో బోయ‌పాటి సినిమా క‌మిట‌య్యాడు రామ్ చ‌ర‌ణ్. అయితే బోయ‌పాటి కూడా కాస్త కొత్త‌గా చూపిస్తాడేమోలే అనుకుంటున్న స‌మ‌యంలో ఇప్పుడు విన‌య విధేయ రామ టీజ‌ర్ విడుద‌లైంది.

Ram charan boyapati

ఇది చూసిన త‌ర్వాత కొత్త‌ద‌నం అనే మాట‌కు అస్స‌లు తావే లేకుండా పోయింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ లో కూడా ఇది క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇక టీజ‌ర్ గురించి మాట్లాడుకుంటే కొత్త‌ద‌నం మాట అటుంచితే మ‌రోసారి స‌రైనోడు సినిమా తీసిన‌ట్లు అనిపిస్తుంది. అయితే త‌న మార్క్ మసాలాలు అన్నీ క‌లిపి సిద్ధం చేస్తున్నాడు బోయ‌పాటి శ్రీను. దాంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. న‌వంబ‌ర్ 10లోపు షూటింగ్ అంతా పూర్తైపోతుంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. రెండు పాట‌లు.. డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా న‌వంబ‌ర్ 9 నుంచి మొద‌ల‌వుతుంద‌ని క్లారిటీ ఇచ్చాడు.

రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆ అంచ‌నాల‌ను.. మార్కెట్ ను నిల‌బెట్టేలా ఈ చిత్రం ఉంటుంద‌ని ఆశిస్తున్నాడు. అదే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాడు కూడా. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఎఫ్ 2 సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఆ రెండింటినీ త‌న సినిమాతో ఢీ కొట్టాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here